IND vs AUS: కోహ్లీ ప్లేస్ కొట్టేసిన అయ్యర్.. మూడో వన్డేలో ఓపెనర్ గా విరాట్..?

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కోహ్లీకి రెస్ట్ ఇవ్వగా.. శ్రేయాస్ అయ్యర్ నెంబర్ 3 లో వచ్చి సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం అయ్యర్.. నెంబర్ 3లో బాగా ఆడినా ఆ ప్లేస్ విరాట్ నుంచి ఎవరూ దొంగిలించలేరని స్పష్టం చేసాడు. అయితే విరాట్ కోహ్లీ తుది జట్టులోకి వచ్చినా.. అయ్యర్ నెంబర్ 3 లోనే ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 
ఆస్ట్రేలియాతో సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో వన్డే ప్రస్తుతం రాజ్ కోట్ లో జరుగుతుంది. ఈ మ్యాచులో రోహిత్ శర్మ ప్లేయింగ్ 11 ప్రకటించినప్పుడు టీమిండియా రెగ్యులర్ ఓపెనర్లు గిల్, కిషాన్, గైక్వాడ్ లను తుది జట్టులోకి తీసుకోలేదు. గిల్ కి రెస్ట్ ఇస్తున్నట్లు ముందే తెలపగా.. ఆసియా క్రీడల కోసం గైక్వాడ్ ని జట్టు నుండి రిలీజ్ చేశారు. ఇక టాస్ సమయంలో కిషాన్ అనారోగ్యంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఈ రోజు రోహిత్ తో భారత్ ఇన్నింగ్స్ ని ఆరంభించే అవకాశాలు  కోహ్లీకే ఎక్కువగా ఉన్నాయి. 

జట్టులో రోహిత్, కోహ్లీ కాకుండా ఉన్న అయ్యర్,సూర్య కుమార్ యాదవ్, రాహుల్ మాత్రమే స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఉన్నారు. ఈ ముగ్గురిలో రాహుల్ కి ఓపెనింగ్ అనుభవం ఉన్నా.. మిడిల్ ఆర్డర్ లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్యాటింగ్ లో డెప్త్ లేకపోవడంతో రాహుల్ మిడిల్ లో ఆడడం చాల కీలకం. ఈ నేపథ్యంలో కోహ్లీ ఓపెనర్ గా వస్తాడా..? లేకపోతే తనకు కలిసి వచ్చిన నెంబర్ 3 లోనే బ్యాటింగ్ దిగుతాడేమో చూడాలి. కాగా.. అయ్యర్, కోహ్లీ ఇద్దరికీ కూడా నెంబర్ 3లో 50 కి పైగా యావరేజ్ ఉండడం గమనార్హం.