పాకిస్తాన్తో మ్యాచ్ అంటే చాలు..టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పూనకాలెత్తుతాడు. ఇతర దేశాల మీద ఒక లెవల్ బ్యాటింగ్ చేస్తే...పాకిస్తాన్ మీద మరో లెవల్లో బ్యాటింగ్ చేస్తాడు. ఇక 2022లో టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ ఇన్నింగ్స్ ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఈ మ్యాచ్లో పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ బౌలింగ్ను కోహ్లీ చితకబాదాడు. దీంతో సెప్టెంబర్ 2వ తేదీన జరిగే భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో మరోసారి కోహ్లీ నుంచి అలాంటి ఇన్నింగ్స్ను అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
Also Read ; పాక్ మస్తు ఆడుతోంది..గెలవడం కష్టమే..కానీ
టీ20 వరల్డ్ కప్ తర్వాత మ్యాచ్ జరగనుండటంతో..ఈ గేమ్లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు జట్ల ఆటగాళ్లు పల్లెకెలె స్టేడియంలోని నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండు జట్ల ప్రాక్టీస్ సెషన్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ బౌలర్ రవూఫ్ ..కోహ్లీ దగ్గరకు వచ్చి హగ్ చేసుకున్నాడు. కోహ్లీని నవ్వుతూ పలుకరించాడు. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
King Kohli meets Haris Rauf ahead of the India Vs Pakistan clash. pic.twitter.com/ILPaL6Jk3a
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 1, 2023
2022లో టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి అంచున ఉన్న టీమిండియాను ఒంటిచెత్తో గెలిపించాడు. చెలరేగాడు. హారిస్ రవూఫ్ వేసిన 9వ ఓవర్ చివరి రెండు బంతులకు రెండు భారీ సిక్సర్లుగా మలిచాడు. ఎనిమిది బంతుల్లో 28 పరుగులు కావలసిన దశలో కోహ్లీ కొట్టిన రెండు సిక్సర్లతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ రవూఫ్, కోహ్లీ తలపడబోతున్నారు.