టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి లేనిదంటూ ఏమీ లేదనే చెప్పాలి. కోట్ల ఆస్తి, అంతకు మిచ్చిన ఫాలోయింగ్, గొప్ప కీర్తి. ఒక మనిషి ఆనందానికి ఇంతకంటే ఇంకేం కావాలి. 1000 కోట్లకు పైగా ఆస్తి, 260 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న విరాట్ కు ఇవన్నీ జీవితానికి అసలైన ఆనందం కాదు అంటున్నాడు. తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన విరాట్ తన మనసులోని మాటలు పంచుకున్నాడు.
ఈ సందర్భంగా మాట్లాడిన కోహ్లీ "కీర్తి, విజయం, డబ్బు, ఇవన్నీ మీకు లేనప్పుడు గొప్పగా కనిపిస్తాయి. కానీ నిజం చెప్పాలంటే, అది ఆనందానికి కీలకం కాదు. నేను ఇక్కడ కూర్చొని ఈ మూడింటిని కలిగి ఉన్నానని చెప్పగలను కానీ నేను సంతోషంగా లేని క్షణాలు ఉన్నాయి."అని తెలిపాడు. జీవితంలో విరాట్ ఎన్ని సాధించినా తాను పూర్తిగా సంతోషంగా లేనని చెప్పకనే చెప్పాడు. మరి విరాట్ మనసులో ఏముందో అతనికే తెలియాలి.
ALSO READ :- ఈ హీరోయిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు.. చేసిన నేరం ఏంటీ?
కాగా.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు టోర్నీలో ఐదు మ్యాచ్ లాడిన విరాట్ ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో మొత్తం 354 పరుగులు చేసి ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండవ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం 48 సెంచరీలు చేసిన కోహ్లీ.. మరో సెంచరీ చేస్తే సచిన్ అత్యధిక సెంచరీలు రికార్డును సమం చేస్తాడు. న్యూజిలాండ్ పై ఆడిన మ్యాచులో 95 పరుగులు చేసి ఔటైన కోహ్లీ.. ఈ ఆల్ టైం రికార్డును తృటిలో మిస్ చేసుకున్నాడు.
Star Indian Batter Virat Kohli opens up on what ‘happiness’ means to him
— SportsTiger (@The_SportsTiger) October 25, 2023
?: BCCI/ICC#Cricket #TeamIndia #ViratKohli #VK18 #CricketNews #IndianCricketTeam #CricketTwitter pic.twitter.com/TCyr0f3ri1