యువీ..నీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం

యువీ..నీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ చేసిన ట్వీట్ పై  మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు.తనపై ఇంత ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాదు.. కోహ్లీకి యువీ అంకితం చేసిన బూట్ల జతను, ఎమోషనల్ లేఖను, యువీతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు.

కేన్సర్ పై పోరాడి కోలుకున్న మీ జీవితం ఒక్క క్రికెట్ లోని వాళ్లకే కాకుండా అన్ని రంగాల్లోని వారికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందంటూ ట్వీట్ చేశాడు కోహ్లీ. మీ చుట్టుపక్కల ఉన్నవారి పట్ల మీరు చూపే శ్రద్ధ, మీ దాతృత్వం ఎప్పటికీ గొప్పవే.జీవితాంతం మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా..దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటుందని ట్విట్టర్ ట్వీట్ చేశాడు కోహ్లీ.

అంతకుముందు విరాట్ కోహ్లీకి యువరాజ్ సింగ్ ఎమోషనల్ నోట్ రాశాడు.ఢిల్లీ నుంచి వచ్చిన ఓ అబ్బాయి విరాట్ కోహ్లీకి నేను ఈ స్పెషల్ షూను అంకితం చేస్తున్నాను అంటూ  యూవీ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.

మరిన్ని వార్తల కోసం..

రైతు బీమాకు వయోపరిమితి పెట్టడమేంటి?