
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో సత్తా చాటుతున్నాడు. కీలక ఇన్నింగ్స్ లు ఆడుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో 168 పరుగులు చేసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ కు సిద్ధమవుతున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ సూపర్ ఫైట్ ముందు అందరి దృష్టి కోహ్లీ పైనే ఉంది. కోహ్లీ సొంత నగరం ఢిల్లీ కావడం విశేషం. ఈ మ్యాచ్ కు ముందు కోహ్లీ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ఇంటర్వ్యూలో భాగంగా ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బిగ్గెస్ట్ రైవలరీ ఏది అని అడిగారు. కోహ్లీ స్పందిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేరు చెప్పాడు. "చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్నప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. చెన్నైలో ఆడినప్పుడు CSK అభిమానులు భారీగా ఉంటారు. బెంగళూరులో చెన్నైతో ఆడినప్పుడు కూడా CSK అభిమానులు ఉంటారు. ఇది టెన్షన్ కు గురి చేస్తుంది. మా అభిమానులు వేరే చోట మ్యాచ్ చూడడానికి పెద్దగా రారు. కానీ చెన్నై ఎక్కడ మ్యాచ్ ఆడినా పసుపు రంగుతో నిండిపోతుంది. వాళ్ళు ముందుగానే టికెట్స్ కొనేస్తారు. చెన్నైతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఉత్తేజకరమైన వాతావరణం ఉంటుంది". అని కోహ్లీ అన్నాడు.
“Most intense games in IPL for me is CSK vs RCB at Bengaluru. Obviously in Chennai its full and fully Yellow, but here also they get maximum support”
— 𝐒𝐞𝐫𝐠𝐢𝐨 (@SergioCSKK) April 9, 2025
Virat Hyping up the biggest fanbase for a cricketer and a club 🐐🥵
pic.twitter.com/quMpI0G7gF
ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. గురువారం (ఏప్రిల్ 10) ఢిల్లీ క్యాపిటల్స్ తో సొంతగడ్డపై పోరుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ పై నెగ్గిన ఆర్సీబీ.. ఆ తర్వాత గెలిచి వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. మూడో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ఓడిపోయినా.. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 45 చెన్నైపై నెగ్గింది