![చరిత్ర సృష్టించిన కోహ్లీ....సచిన్ సరసన నిలిచాడు](https://static.v6velugu.com/uploads/2023/07/Virat-Kohli-played-with-Tej-Narayan-Chandrapal-and-Shivnarayan-Chandrapal_m5ZLUFDyk6.jpg)
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జులై 12వ తేదీ బుధవారం తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ టెస్టులో బరిలోకి దిగిన కోహ్లీ....తండ్రీ కొడుకులతో కలిసి ఆడిన టీమిండియా రెండో భారత క్రికెటర్‌గా చరిత్ర నెలకొల్పాడు.
12 ఏళ్ల క్రితం అంటే 2011లో వెస్టిండీస్ పర్యటనలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ..ఆ సమయంలో విండీస్ ఆటగాడు శివనారాయణ్ చంద్రపాల్‌తో ఆడాడు. తాజా పర్యటనలో శివనారయణ్ కుమారుడు తేజ్ నారాయణ్ చంద్రపాల్‌తో ఆడుతున్నాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి విండీస్ బ్యాటింగ్ ఎంచుకోగా..తేజ్ నారయణ్ చందర్ పాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. దీంతో తండ్రీ, కొడుకుతో కలిసి ఆడిన క్రికెటర్ గా విరాట్ కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. సచిన్ టెండూల్కర్ 1992లో ఆసీస్ మాజీ ఆటగాడు జెఫ్ మార్ష్‌తో కలిసి ఆడాడు. ఆ తర్వాత జెఫ్ మార్ష్ కుమారుడు షాన్ మార్ష్ తో కలిసి సచిన్ 2011లో ఆడాడు.