స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. బెంగుళూరు గడ్డపై తొలి టెస్టులో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన.. రెండో టెస్టులోనూ అలాంటి ప్రదర్శన చేసింది. పూణే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మరోసారి పేలవ బ్యాటింగ్‌తో 156 పరుగులకే కుప్పకూలింది. కివీస్ స్పిన్నర్ మిచ్చెల్ సాంట్నర్ ధాటికి భారత బ్యాటర్లు విలవిలలాడిపోయారు.
ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఔటైన తీరు.. ఒక్కఒక్కరిది ఒక్కో రకం. ఒకరు వేగంగా ఆడబోయి వికెట్ పారేసుకుంటే.. అతని వెంటే నా ప్రయాణం అన్నట్టు మరొకరు పెవిలియన్ బాట పట్టారు. ఇంకొకరు పేలవ షాట్‌తో వికెట్ సమర్పించుకున్నారు. ఆ భారత బ్యాటర్ మరోవరో కాదు.. విరాట్ కోహ్లీ. ఫుల్‌టాస్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆగి వస్తున్న బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన భారత స్టార్.. బ్యాట్‌ను ముందుగానే ఊపి మూల్యం చెల్లించుకున్నాడు. కోహ్లీ ఇలా ఔట్ అవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ | David Warner: నువ్వెళ్ళి బిగ్ బాష్ ఆడుకో.. వార్నర్‌కు కమ్మిన్స్ స్వీట్ పంచ్
అతని కెరీర్‌లోనే చెత్త షాట్..
కోహ్లీ ఫుల్‌టాస్ బంతికి క్లీన్ బౌల్డ్ అవ్వడాన్ని.. అతని కెరీర్‌లోనే అత్యంత చెత్త షాట్‌గా అభివర్ణించాడు.. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్. డగౌట్‌కు వెళ్లాక కోహ్లీ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటాడని చెప్పాడు. అనుభవం కలిగిన కోహ్లీ కాస్త ఆచితూచి ఆడాల్సిందని తన అభిప్రయాన్ని వెల్లడించాడు. విరాట్ ఔటైన అనంతరం.. మిడిల్, లోయర్ ఆర్డర్ వికెట్లు టఫటఫా నేలరాలాయి. 16/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు కుప్పకూలింది.
Virat Kohli out 🥺🥺🥺#ViratKohli #INDvsNZ pic.twitter.com/49ytD5Jewv
— Virat (@chiku_187) October 25, 2024