
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సహచర క్రికెటర్ల పట్ల మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఆదివారం (ఏప్రిల్ 13) జైపూర్ లోని మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ వానిందు హసరంగాకు ప్రామిస్ చేశాడు. మ్యాచ్ తర్వాత కోహ్లీ, హసరంగా మధ్య సరదాగా సంభాషణ జరిగింది. కోహ్లీ బ్యాట్ ను పట్టుకొని హసరంగా "నైస్ బ్యాట్" అంటూ కితాబులిచ్చాడు. దీనికి కోహ్లీ సానుకూలంగా స్పందించిన తీరు ఆకట్టుకుంటుంది.
"బ్యాట్ నీకు కూడా కావాలా.. నా దగ్గర ఉన్న బ్యాట్ నీకు ఇస్తాను. బెంగళూరులో కలుద్దాం అక్కడ నీకు బ్యాట్ ఇస్తాను". అని విరాట్.. లంక స్పిన్నర్ తో అన్నాడు. కోహ్లీ సమాధానానికి హసరంగా సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఇప్పటికే తన దగ్గర ఉన్న చాలా బ్యాట్ లను కోహ్లీ సహచర క్రికెటర్లకు గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే. కోహ్లీకి హసరంగాకు మధ్య చక్కని అనుబంధం ఉంది. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున కోహ్లీతో హసరంగా కలిసి ఆడాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున హసరంగా ఆడుతున్నాడు.
KING KOHLI - A PURE SOUL. 🐐
— Tanuj (@ImTanujSingh) April 14, 2025
- The way Virat Kohli told Hasaranga "I will give you one bat". ❤️
pic.twitter.com/4UDQcPzQnk
బెంగళూరు వేదికగా గురువారం (ఏప్రిల్ 24) చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మరో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో హసరంగాకు కోహ్లీ తన దగ్గర బ్యాట్ ను గిఫ్ట్ గా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక విజయాన్ని అందుకుంది. ఆదివారం (ఏప్రిల్ 13) రాజస్థాన్ రాయల్స్ పై అలవోక గెలుపుతో టోర్నీలో నాలుగో విక్టరీని తమ ఖాతాలో వేసుకుంది.
మొదట బౌలర్లు కట్టుదిట్టంగా రాణించడంతో పాటు.. ఛేజింగ్ లో సాల్ట్(33 బంతుల్లో 65:5 ఫోర్లు, 6 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (45 బంతుల్లో 65: 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచి కొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగుల డీసెంట్ టోటల్ చేయగలిగింది. లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17.3 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 175 పరుగులు చేసి