బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న టీమిండియా జట్టు ఐటీసీ మౌర్య హోటల్‌లో ప్రత్యేకంగా కేక్ కటింగ్ వేడుకను నిర్వహించింది. ప్రధాని మోదీ నివాసానికి వెళ్లే ముందు టీమ్ ఈ వేడుకల్లో పాల్గొంది. కేక్ పై టీ20 వరల్డ్ కప్ సింబల్ ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో కేక్ కట్ చేసి టీమ్ ను ఉత్సాహపరిచారు. ఛాంపియన్ జట్టు 2024 జూలై 4 గురువారం తెల్లవారుజామున బార్బడోస్ నుండి ఎయిర్ ఇండియా చార్టర్డ్ విమానంలో ఇండియాకు తిరిగి వచ్చింది. రోహిత్ శర్మ తన చేతిలో టీ20 ప్రపంచకప్ ట్రోఫీని చూపిస్తూ అభిమానులకు అభివాదం చేశాడు. జట్టుకు స్వాగతం పలికేందుకు వందలాది మంది అభిమానులు విమానాశ్రయంలో గుమిగూడారు.
#WATCH | Indian Cricket team Coach Rahul Dravid cuts a cake at ITC Maurya in Delhi to celebrate the ICC T20 World Cup victory. pic.twitter.com/ZXf0PQjy1U
— ANI (@ANI) July 4, 2024
జూన్ 29 న సౌతాఫ్రికాతో జరిగిన టీ-ట్వింటీ ఫైనల్స్ లో విజయం సాధించి.. పొట్టి కప్పును సొంతం చేసుకుంది భారత జట్టు. ఆదివారమే టీం ఇండియాకు రావాల్సి ఉండగా.. బార్బడోస్ లో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడే ఉండిపోయింది. నిన్న కాస్త హరికేన్ ప్రభావం తగ్గడంతో ప్రత్యేక విమానం భారత జట్టు బయలు దేరి..ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. చాలా ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు గ్రాండ్ వెల్కం చెప్పారు క్రికెట్ లవర్స్.
ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీని కలవనున్నారు రోహిత్ నేతృత్వంలోని టీమిండియా సభ్యులు. మోదీతో సమావేశం ముగిశాక..విమానంలో ఢిల్లీ నుంచి ముంబైకి బయలు దేరుతారు. సాయంత్రం 5 గంటలకు ముంబయిలో రోడ్ షో ప్రారంభం అవుతుంది. రెండు గంటల పాటు సాగే ఊరేగింపులో రోహిత్ సేన.. ఓపెన్ టాప్ బస్సులో కప్పుతో అభిమానులకు అభివాదం చేస్తారు. రాత్రి వాంఖండే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మానం జరగనుంది.