టీమిండియా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యు భారీగా పడిపోయింది. గతేడాదితో పోలిస్తే కోహ్లీ బ్యాండ్ర్ వాల్యు 22 శాతం తగ్గింది. 2020లో కోహ్లీ బ్రాండ్ వాల్యు 237.7 మిలియన్ డాలర్టు ఉండగా.. 2021 సంవత్సరానికి గానూ 185.7 మిలియన్ డాలర్లుగా ఉంది. అయితే కోహ్లీ బ్రాండ్ వాల్యు తగ్గినా ఇండియాలో అత్యధిక విలువ కలిగిన ఆటగాడిగా కోహ్లీ ప్రథమ స్థానంలో ఉన్నాడు. 185.7 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ.1400 కోట్లు) ఉన్నాడు.
కోహ్లీ తర్వాత బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ 158.3 మిలియన్ డాలర్లు( రూ.1196 కోట్లు ), అక్షయ్ కుమార్ 139.6 మిలియన్ డాలర్లు ( రూ1055 కోట్లు) ఉన్నాడు. నాల్గో స్థానంలో అలియా భట్.. ఐదవ స్థానంలో ధోని. ఆరవ స్థానంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, సల్మాన్ ఖాన్, అయుష్మాన్ ఖురాన్ ,హృతిక్ రోషన్ సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ బ్రాండ్ పెరిగింది. 2020 లో 25.7 మిలియన్ డాలర్లు ఉండగా 2021కి గానూ 32.2(దాదాపు 243 కోట్లతో ) 13వ స్థానంలో ఉన్నాడు.