
టీమిండియా కింగ్ కోహ్లీ.. టీ20లకు గుడ్ బై చెప్పాడు. వరల్డ్ కప్ ఫైనల్‌తో తన చివరి మ్యాచ్ ఆడేసిన విరాట్ కప్‌తో పొట్టి ఫార్మాట్‌ను చిరస్మరణీయంగా ముగించాడు. ఫలితంగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను అందించి తిరుగులేని చాంపియన్‌గా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. 2010లో జింబాబ్వేపై అరంగేట్రం చేసిన విరాట్ కెరీర్‌లో 125 టీ20లు ఆడాడు. 137 స్ట్రయిక్ రేట్‌తో 4188 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ‘ఇది నా చివరి టీ20 మ్యాచ్. తర్వాతి తరానికి అవకాశం ఇచ్చే సమయం వచ్చేసింది’ అని కోహ్లీ పేర్కొన్నాడు.