విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇద్దరూ ఇద్దరే. ఇంటికి పిల్లర్లు ఎలాగో.. భారత జట్టుకు వీరిద్దరూ అలా అన్నమాట. ఫామ్‌లో ఉన్నారంటే.. ప్రత్యర్థి జట్టుకు వణుకు పుట్టాల్సిందే. పరుగుల వరద పారాల్సిందే. జట్టు ఏదైనా.. బౌలర్ ఎవరైనా ఆ మ్యాచ్ వారికొక పీడకలగా మిగిలిపోవాల్సిందే. అలాంటి గొప్ప ఆటగాళ్లు. వీరిలో ఎవరు బెస్ట్ అంటే ఎవరూ చెప్పలేరు. తాజాగా ఈ ప్రశ్న భారత వికెట్ కీపర్, వ్యాఖ్యాత దినేష్ కార్తీక్ కు ఎదురైంది.
కోహ్లీ, రోహిత్‌లలో ఎవరు బెస్ట్..? అని క్రిక్‌బజ్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు డీకే అదిరిపోయే సమాధానమిచ్చాడు. ఇంకొకరిని నొప్పించక అన్న రీతిలో తెలివైన సమాధానం చెప్పాడు. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే రోహిత్‌ను ఇష్టపడతానన్న కార్తీక్.. ఛేజింగ్‌లో కోహ్లీ ఆటను ఇష్టమని తెలిపాడు.
"నన్ను చంపేస్తారా? ఏంటి.. రోహిత్, విరాట్ ఇద్దరూ నా స్నేహితులు. అయినప్పటికీ, నేను నిజాయితీగా సమాధానం ఇస్తాను. భారత జట్టు మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రోహిత్‌ను చూడటం నాకు చాలా ఇష్టం. అతనికి మూడు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. సెకండ్ బ్యాటింగ్ లో ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ.." అని డీకే సమాధానమిచ్చాడు.
వార్ వన్ సైడ్
పూణే వేదికగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఏకపక్షంగా సాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 256 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో భారత్ ధీటుగా బదులిస్తోంది. 25 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్.. 161-2. శుభ్ మాన్ గిల్(53) హాఫ్ సెంచరీ చేయగా.. రోహిత్ శర్మ (40) పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ(42), శ్రేయాస్ అయ్యర్(16) క్రీజులో ఉన్నారు.
Half-century for Shubman Gill! ??#TeamIndia moving along nicely in the chase at 128/1
— BCCI (@BCCI) October 19, 2023
Follow the match ▶️ https://t.co/GpxgVtP2fb#CWC23 | #INDvBAN | #MenInBlue pic.twitter.com/iUwxC7LdcL