ప్రపంచ కప్ ఆడుతున్న స్టార్ ఆటగాళ్లకు, క్రికెట్ లో పని చేస్తున్న పెద్దలకు సాధారణంగా ఎదురయ్యే సమస్య ఒకటి ఉంది. అదేంటో కాదు వరల్డ్ కప్ టికెట్ల కోసం తమ స్నేహితులు, బంధువులు వీరిని రిక్వస్ట్ చేస్తూ ఉంటారు. టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దీనికి మినహాయింపేమీ కాదు. తాజాగా విరాట్ ఈ విషయంలో ఒక కఠిన నిర్ణయం తీసుకుంటూ స్నేహితులని, బంధువులని కోరాడు.
కోహ్లీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా .. ప్రపంచ కప్ టిక్కెట్ అభ్యర్థనల కోసం తనను సంప్రదించవద్దని తన బంధువులు, స్నేహితులను కోరాడు. మొదటి సారి పూర్తి స్థాయిలో భారత్ లో వరల్డ్ కప్ నిర్వహిస్తుండడంతో దాదాపు అన్ని స్టేడియం సీట్లు, టిక్కెట్‌లు అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా టికెట్ల కోసం విరాట్ ని విసిగిస్తే అతను తన ఏకాగ్రతను కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకేనేమో విరాట్ ముందుగానే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టి ఉంటాడని కామెంట్లు వినిపిస్తన్నాయి.
కాగా.. రేపటి నుంచి (అక్టోబర్ 5) భారత్ వేదికగా ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో రన్నరప్ న్యూజీలాండ్ తలపడబోతుంది. భారత్ విషయానికి వస్తే అక్టోబర్ 8 న ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14 న జరగనుంది.
Virat Kohli's Instagram story. pic.twitter.com/BPN4S1T7DO
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2023