Virat Kohli: 2016లో రెండు సార్లు నా హృదయం ముక్కలైంది: విరాట్ కోహ్లీ ఎమోషనల్

Virat Kohli: 2016లో రెండు సార్లు నా హృదయం ముక్కలైంది: విరాట్ కోహ్లీ ఎమోషనల్

టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కెరీర్ లో ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. వ్యక్తిగతంగా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసినా జట్టుకు ట్రోఫీ అందించలేదనే వెలితి విరాట్ ను బాధిస్తూ ఉంటుంది. జట్టు గెలుపు కోసం 100 శాతం తపన పడే కోహ్లీకి టీమిండియాకు గత పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ అందించలేకపోతున్నాడు. మరోవైపు ఐపీఎల్ లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ అందించడంలో విఫలమవుతున్నాడు. తాజాగా జియో సినిమాతో మాట్లాడిన కోహ్లీ.. క్రికెట్ లో తాను బాగా బాధపడిన రెండు సందర్భాలు గురించి చెప్పి ఎమోషనల్ అయ్యాడు. 

2016లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ ఓటమి తనను ఎంతగానో బాధించిందని కోహ్లీ అన్నాడు. ఈ టోర్నీ అంతటా కోహ్లీ అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. సెమీస్ వెళ్లాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ చేయడంతో పాటు విండీస్ తో జరిగిన సెమీస్ లో 89 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఇక ఇదే ఏడాది ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు ఓడిపోవడం కోహ్లీని ఎంతగానో బాధించిందట. ఈ రెండు సార్లు తాను జట్టుకు ట్రోఫీ ఇవ్వాలనుకున్న అని.. అయితే అలా జరగలేదని జియో సినిమాతో కోహ్లీ చెప్పుకొచ్చాడు. 2016 ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో అసాధారణ ఫామ్ తో కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేశాడు.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా నేడు (మే 18) చెన్నై సూపర్ కింగ్స్ తో కీలక మ్యాచ్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ లో చెన్నైను భారీ తేడాతో ఓడిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్ కు చేరుతుంది. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జారనుండడంతో అందరి కళ్ళు కోహ్లీ మీదే ఉన్నాయి.