IND vs PAK: కోహ్లీ హాఫ్ సెంచరీ.. గెలుపు దిశగా టీమిండియా

IND vs PAK: కోహ్లీ హాఫ్ సెంచరీ.. గెలుపు దిశగా టీమిండియా

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‎తో జరుగుతోన్న మ్యాచులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆకట్టుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఫామ్ లేక ఇబ్బంది పడుతోన్న విరాట్ కోహ్లీ.. ప్రతిష్టాత్మకమైన మ్యాచులో తిరిగి ఫామ్‎లోకి వచ్చాడు. దాయాదీ పాక్ బౌలింగ్ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ కోహ్లీ హఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో కోహ్లీ అంతర్జాతీయ వన్డేల్లో 74వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

ప్రస్తుతం విరాట్ కోహ్లీ (60), శ్రేయస్ అయ్యర్ (16) క్రీజులో ఉన్నారు.  టీమిండియా 29 ఓవర్లలో రెండు వికెట్ నష్టానికి150 పరుగులు చేసింది. ఈ మ్యాచులో భారత్ విజయాం సాధించాలంటే  126 బంతుల్లో 92 పరుగులు చేయాల్సి ఉంది. మరో 8 వికెట్లు చేతిలో ఉండటంతో పాటు.. కోహ్లీ మాంచి ఫామ్‎లో ఉండటంతో ఈ మ్యాచులో టీమిండియా గెలుపు దాదాపు ఖాయమైనట్టే. 

Also Read :  రోహిత్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీల సరసన

ఈ మ్యాచులో కోహ్లీ మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‎లో 14 వేల పరుగుల క్లబ్‎లోకి ఎంట్రీ ఇచ్చాడు రన్ మెషిన్. ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 23) పాకిస్థాన్‎తో జరిగిన మ్యాచులో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. మొత్తం 287 ఇన్సింగ్స్‎ల్లో 14 వేల పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ.. తద్వారా అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‎లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‎గా రికార్డ్ క్రియేట్ చేశాడు. 

కోహ్లీ కంటే ముందు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ స్టార్ ప్లేయర్ సంగక్కర మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. అయితే.. వన్డే ఫార్మాట్‎లో అత్యంత వేగంగా 8 వేలు, 9 వేలు, 10 వేలు, 11 వేలు, 12 వేలు, 13 వేలు, 14 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‎గా కోహ్లీ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.