సెంచరీలు కొట్టడం విరాట్ కోహ్లీకి తెలిసినంత మరెవరికీ తెలియదేమో. క్రీజ్ లో ఒక్కసారి కుదురుకుంటే ఇక సెంచరీ ఖాయం అనుకోవాల్సిందే. తాజాగా కోహ్లీ ఆసియా కప్ లో మరో సెంచరీ బాదేశాడు. సూపర్-4 లో భాగంగా నిన్న పాకిస్థాన్ మీద జరిగిన మ్యాచులో పాక్ బౌలర్లని చీల్చి చెండాడాడు. ఇన్నింగ్స్ ని నిదానంగానే ఆరంభించిన విరాట్..క్రమంగా వేగాన్ని పెంచి 84 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 47 వ సెంచరీ కాగా ఓవరాల్ గా 77 వది. ఇక కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో కోహ్లీ రికార్డ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.
వరుసగా నాలుగు సెంచరీలు
సెంచరీలు బాదేయడం అలవాటు ఉన్న కోహ్లీకి కొలొంబోలో నమ్మశక్యం కానీ రీతిలో వరుసగా నాలుగు సెంచరీలు చేయడం విశేషం. ఈ నాలుగింటిలో మూడు సార్లు నాటౌట్‌గా నిలువడం గమనార్హం. తొలిసారి 2012లో ఈ మైదానంలో లంకతో మ్యాచ్ ఆడిన కోహ్లీ 128 పరుగులు చేసిన నాటౌట్ గా నిలిచిన విరాట్.. 2017లో లంకపైనే 131 పరుగులు చేశాడు. ఇక అదే ఏడాది లంకపై 110 పరుగులతో అజేయ శతకం ఖాతాలో వేసుకోగా.. తాజాగా ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన పోరులో కోహ్లీ 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఈ రోజు కూడా సెంచరీ ఖాయమేనా..?
ఇక ఆసియా కప్ లో భాగంగా నేడు మరోసారి కొలొంబోలో కోహ్లీ మ్యాచ్ ఆడే అవకాశమొచ్చింది. దీంతో కోహ్లీ మరో సెంచరీ చేస్తాడని ఫ్యాన్స్ ఫై అయిపోయారు. శ్రీలంకతో మంచి రికార్డ్ ఉన్న కోహ్లీకి ప్రేమదాస స్టేడియంలో నేడు మ్యాచ్ ఆడుతుండడంతో మరోసారి కోహ్లీ వైపే అందరి కళ్ళు ఉన్నాయి. మరి కింగ్ మరో సెంచరీ చేస్తాడో లేదో చూద్దాం.