Virat Kohli: వండే ర్యాంకింగ్స్లో కోహ్లీ మరో రికార్డు

Virat Kohli: వండే ర్యాంకింగ్స్లో కోహ్లీ మరో రికార్డు

దుబాయ్‌‌‌‌: టీమిండియా సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ (747) ఐసీసీ వన్డే ర్యాంక్‌‌‌‌ను మెరుగుపర్చుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో విరాట్‌‌‌‌ ఒక్క ప్లేస్‌‌‌‌ ఎగబాకి నాలుగో ర్యాంక్‌‌‌‌లో నిలిచాడు. చాంపియన్స్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో ఆస్ట్రేలియాపై 84 రన్స్‌‌‌‌ చేయడంతో కోహ్లీ ర్యాంక్‌‌‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది. 

కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ (745) రెండు స్థానాలు దిగజారి ఐదో ర్యాంక్‌‌‌‌లో నిలిచాడు. శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (791) టాప్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌లో కొనసాగుతుండగా, బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ (770), క్లాసెన్‌‌‌‌ (760) వరుసగా రెండు, మూడో ర్యాంక్‌‌‌‌ల్లో ఉన్నారు. బౌలింగ్‌‌‌‌లో షమీ (609) మూడు ప్లేస్‌‌‌‌లు ఎగబాకి 11వ ర్యాంక్‌‌‌‌ను సాధించాడు. 

ఆల్‌‌‌‌రౌండర్స్​ కేటగిరీలో జడేజా (213) తొమ్మిదో ర్యాంక్‌‌‌‌లో ఉండగా, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ (194).. ఏకంగా 17 స్థానాలు మెరుగుపడి 13వ ర్యాంక్‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు.