విరాట్ కోహ్లీ పెళ్లిపై షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు

వరల్డ్  టాప్ బ్యాట్స్ మ్యాన్ లో ఒకడైన విరాట్ కోహ్లీపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. అతడు కెఫ్టెన్సీని వదిలేయడంతో చాలామంది కోహ్లీని టార్గెట్ చేస్తూ.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మాజీ పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ .. కోహ్లీ కెరియర్, పెళ్లికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక వేళ తాను కోహ్లీ స్థానంలో ఉంటే..అంత త్వరగా పెళ్లి చేసుకునేవాడిని కాదన్నారు అక్తర్. కేవలం పరుగులు చేస్తూ, క్రికెట్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని అని చెప్పుకున్నాడు. అయితే  బ్యాట్స్‌మెన్‌గా ఈ 10 నుంచి 12 ఏళ్ల సమయం ఎప్పటికీ తిరిగి రాదన్నాడు. 

పెళ్లి చేసుకోవడం తప్పని అనడం లేదు, ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని కూడా తాను చెప్పడం లేదన్నారు. ఒక 120 సెంచరీలు చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటే బావుండేదని అక్తర్ అన్నాడు. అయితే భారత జట్టుకి ఆడుతున్నప్పుడు ఆ కాస్త సమయంలో క్రికెట్‌ని పూర్తిగా ఎంజాయ్ చేయాలన్నాడు. కుటుంబ బాధ్యతలు పెరిగే కొద్దీ, క్రికెట్‌పై పూర్తి స్థాయి దృష్టిని పెట్టేలేమని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫామ్‌ను అందుకోకపోవడానికి అదే కారణమని అనుకుంటున్నాడని తెలిపాడు. పెళ్లయ్యాక విరాట్ కోహ్లీ ఇంతకుముందులా పరుగులు చేయలేదనే తన ఉద్దేశం...’ అంటూ కామెంట్ చేశాడు షోయబ్ అక్తర్. అయితే షోయబ్ అక్తర్ కామెంట్స్ పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. షోయబ్ కామెంట్స్ సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదంటున్నారు. అతడు నోటికొచ్చినట్లు ఏదో ఒకటి మాట్లాడుతుంటాడని మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి: 

కోహ్లీ గొప్ప క్రికెటర్..బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పించారు

హైదరాబాద్ లో పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు