బెంగళూరు : ఐపీఎల్‌లో సూపర్ ఫామ్‌తో దూసుకుపోతున్న విరాట్ కోహ్లీని టీ20 వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా దించాలని బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఆ దిశగా టీమిండియా మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకోవాలని సూచించాడు. ప్రస్తుతం జరుగుతున్న మెగా లీగ్‌లో విరాట్ 12 మ్యాచ్‌ల్లో 634 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అతని సగటు 70.44 కాగా, స్ట్రయిక్ రేట్ 153.51గా ఉంది. విరాట్ మొత్తం కెరీర్ రేట్ కంటే ఇది చాలా ఎక్కువగా ఉండటం విశేషం.
‘ఈ సీజన్‌లో విరాట్ అనూహ్యంగా ఆడుతున్నాడు. పంజాబ్‌పై అతని బ్యాటింగ్ సూపర్. చాలా తక్కువ టైమ్‌లో 90 రన్స్ కొట్టాడు. అందుకే అతన్ని ఓపెనర్‌గా పంపాలి. గత కొన్ని ఐపీఎల్ ఇన్నింగ్స్‌లు చాలా అద్భుతంగా ఉన్నాయి’ అని దాదా పేర్కొన్నాడు. 17 ఏళ్ల విరామం తర్వాత ట్రోఫీని కైవసం చేసుకునే సత్తా ఉన్న టీమ్‌ను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిందన్నాడు.
బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూర్పు కూడా చాలా బాగుందన్నాడు. ఈ ఐపీఎల్‌లో పెద్దగా శ్రమించకుండానే టీమ్స్ 250 రన్స్‌ను మార్క్‌ను దాటుతున్నాయన్నాడు. ఫ్యూచర్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందన్నాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్ పవర్ ఓరియెంటెడ్ గేమ్‌గా మారిపోయిందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.