విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం

విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్ల బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ.. తాజాగా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు.  ఈ విషయాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఏడేళ్ల నుంచి కెప్టెన్ గా టీంను సరైనా మార్గంలో కృషి చేశానని కోహ్లీ తెలిపాడు. ప్రతి దానికి ముగింపనేది ఉంటుందని..అది తన టెస్టు కెప్టెన్సీకూ కూడా అని అన్నాడు. ఎన్నో ఎత్తుపల్లాలను  అనుభవించానని.. టీమిండియా విజయం కోసం120 శాతం కృషి చేశానన్నాడు. బీసీసీఐ, రవిశాస్త్రి, ఎంఎస్ ధోనీకి ధన్యవాదాలు తెలిపారు. మరీ ముఖ్యంగా తన మీద నమ్మకముంచిని ధోనీకి కృతజ్ఞతలు అంటూ విరాట్ పోస్ట్ చేశాడు.

2014లో ఎమ్మెస్ ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్.. గత ఐదేళ్లుగా భారత జట్టును ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిపాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అద్భుతమైన విజయాలు అందుకున్న భారత జట్టు.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2019-21 ఫైనల్ కి అర్హత సాధించింది. కొహ్లీ మొత్తం 68 టెస్టులకు కెప్టెన్సీ వహించగా అందులో 40  మ్యాచ్ లను  గెలిపించాడు. కొహ్లీకి ధన్యవాదాలు తెలిపిన బీసీసీఐ.. కోహ్లీకి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పింది. అతని కెప్టెన్సీలో టీమిండియా జట్టును ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడని..అతను మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అంటూ కోహ్లీ పోస్ట్ ను  బీసీసీఐ రీట్వీట్ చేసింది. ఇటీవల వన్డే, టీ20 ల కెప్టెన్సీ నుంచి కోహ్లీ బీసీసీఐ తప్పించింది. అతని స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించింది.