టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు ఎప్పుడైతే గాయమైందో అప్పటినుంచి భారత్ కు కష్టాలు మొదలయ్యాయి. హార్దిక్ లేకుండా మన జట్టు విజయాలు సాధిస్తున్నా.. ఆరో బౌలర్ కొరత మాత్రం అలాగే ఉంది. అయితే సమస్యను పూడ్చే పనిలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. నెట్స్ లో బౌలింగ్ చేస్తూ చెమటోడుస్తూ ఉన్నాడు. ఇంగ్లాండ్ మీద బౌలింగ్ వేసేందుకు సిద్ధమయ్యాడు.
వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఆదివారం( అక్టోబర్ 29) ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. లక్నో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో చీలమండ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు పాండ్య అందుబాటులో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో భారత బ్యాటర్లు సైతం నెట్స్ లో బౌలింగ్ వేస్తూ కనిపించారు. గురువారం(అక్టోబర్ 26) ముఖ్యంగా విరాట్ కోహ్లీ గిల్, రోహిత్ శర్మలకు బౌలింగ్ చాలా సేపు బౌలింగ్ వేస్తూ కనిపించాడు.
దీంతో ఇంగ్లాండ్ పై మ్యాచ్ లో కోహ్లీ బౌలింగ్ చేస్తాడని గట్టిగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం 5 గురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడుతున్న టీమిండియా ఆరో బౌలర్ ఎవరనే దానికి సమాధానం లేదు. ఈ నేపథ్యంలో ఒక మెయిన్ బౌలర్ ని టార్గెట్ చేస్తే భారత్ ఎవరితో బౌలింగ్ వేయిస్తుంది అనే ప్రశ్న ఆందోళనకరంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్ము రేపుతున్న భారత్ ఈ ఆరో బౌలర్ లేని లోటును ఎలా తీరుస్తుందో చూడాలి.
— Modiji Sings (@ModijiSings) October 27, 2023