Virat Kohli: ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ టెన్షన్.. ప్రాక్టీస్‌ చేస్తుండగా కోహ్లీకి గాయం

Virat Kohli: ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ టెన్షన్.. ప్రాక్టీస్‌ చేస్తుండగా కోహ్లీకి గాయం

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డట్టు సమాచారం. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో నెట్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కోహ్లీకి స్వల్ప గాయాలయ్యాయట. నెట్స్‌లో ఫాస్ట్ బౌలర్‌ను ఎదుర్కొంటున్న సమయంలో కోహ్లీ మోకాలికి గాయమైంది. దీంతో కోహ్లీ వెంటనే ప్రాక్టీస్ సెషన్ ఆపేసినట్టు సమాచారం. ఫైనల్ కు ఒక రోజు ముందు కోహ్లీకి గాయపడడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. గాయం అయిన వెంటనే ఫిజియో మోకాలికి స్ప్రే చల్లారు. దెబ్బ తగిలిన చోటు కట్టు కట్టారు. దీంతో కోహ్లీ వెంటనే ప్రాక్టీస్ సెషన్ ఆపేసినట్టు సమాచారం. 

నివేదికల ప్రకారం కోహ్లీకి స్వల్ప గాయమైనట్టు తెలుస్తుంది. గాయం తర్వాత కోహ్లీకి కొద్దిగా నొప్పి అనిపించినా ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా కనిపించాడని తెలుస్తుంది. భారత కోచింగ్ సిబ్బంది కోహ్లీ గాయం తీవ్రమైనది కాదని.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమయానికి పూర్తి ఫిట్ గా ఉంటాడని స్పష్టం చేశారు. ఒకవేళ కోహ్లీ గాయం కారణంగా మ్యాచ్ ఆడకపోతే విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. కోహ్లీ మ్యాచ్ కు అందుబాటులో లేకపోతే అతని స్థానంలో రిషబ్ పంత్ తుది జట్టులోకి వస్తాడు. 

ALSO READ | Kane Williamson: నా కెరీర్‌లో ఆ ముగ్గురిని ఔట్ చేయడం కష్టంగా అనిపించేది: విలియంసన్

విరాట్ కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కోహ్లీ తన హవా చూపిస్తున్నాడు. నాలుగు మ్యాచ్ ల్లో 72.33  సగటుతో  217 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. వీటిలో పాకిస్థాన్ పై చేసిన సెంచరీతో పాటు సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై చేసిన 84 పరుగుల మ్యాచ్ విన్నింగ్ నాక్ ఉంది. ఫైనల్లోనూ కోహ్లీపై భారీ అంచనాలు ఉన్నాయి.  

దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9) భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లతో పాటు క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఇండియా క్లియర్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఏ జట్టు గెలిచినా వారికి రెండో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ అవుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2:30 నిమిషాలకు జరుగుతుంది. టాస్ 2:00 గంటలకు వేస్తారు. స్టార్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌–18, జియో హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌ ప్రసారమవుతుంది.