బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షణలో కోహ్లీ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షణలో కోహ్లీ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ రంజీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రావడానికి టీమిండియా మాజీ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయం తీసుకున్నాడు. ముంబై శివారులో బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యక్తిగతంగా నెలకొల్పిన సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విరాట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముఖ్యంగా  బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆటపై నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫోకస్ పెట్టాడు. 2014 నుంచి 2019 వరకు బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పుడు విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరుగుల వరద పారించాడు. బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత విక్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాథోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రావడంతో కోహ్లీ ఆట గాడి తప్పింది. 

దీంతో మరోసారి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రావడానికి బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించాడు. రైజింగ్ డెలివరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలా ఎదుర్కొవాలన్న దానిపై కోహ్లీకి బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పలు సూచనలు చేశాడు. 16 గజాల దూరం నుంచి త్రోడౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేస్తూ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాటిని ఆడటంపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. ఇందుకోసం చక్రాల బండిపై రూపొందించిన సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్లాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్యలో ఉంచి వాటిపై బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేశాడు. కోహ్లీ కొన్నేండ్ల నుంచి ఎక్కువ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడటంతో బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆట మరుగున పడింది. 

దీంతో ఇప్పుడు దీనికి బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదును పెడుతున్నాడు. కోహ్లీ ఆటను  పరిశీలిస్తే గత కొన్నేళ్లుగా తను స్క్వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రైవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడటం లేదు. ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాత్రమే ఆడుతున్నాడు. దీంతో బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త  స్ట్రోక్స్‌‌  ఆడేందుకు బంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయం చేస్తున్నాడు.