పాకిస్తాన్​కు బౌలింగే బలం : విరాట్‌‌ కోహ్లీ

పాకిస్తాన్​కు  బౌలింగే బలం : విరాట్‌‌ కోహ్లీ

పల్లెకెలె: పాకిస్తాన్‌‌ నాణ్యమైన పేస్‌‌ బౌలింగ్‌‌ను దీటుగా ఎదుర్కోవాలంటే తాము అత్యుత్తమ ఆటతీరును చూపెట్టాలని టీమిండియా మాజీ కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ అన్నాడు. ‘పాక్‌‌కు బౌలింగే బలం. ఏ క్షణంలోనైనా మ్యాచ్‌‌ను తారుమారు చేసే సత్తా ఉన్న బౌలర్లకు కొదవలేదు. కాబట్టి వాళ్లకు ఎదురొడ్డి నిలవాలంటే మనం అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలి. నేను నా ఆటను ఎలా మెరుగుపర్చుకోవాలో అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తా. 

ప్రతి రోజు, ప్రతి ప్రాక్టీస్‌‌ సెషన్‌‌, ప్రతి ఏడాది  నా ఆటలో ఎంతో కొంత మెరుగు కనిపించాలి. చాలా కాలం ఆడటానికి ఇది దోహదం చేస్తుంది. అలాగే టీమ్‌‌ పెర్ఫామెన్స్‌‌ పెంచడానికి కూడా ఇది సాయపడుతుంది. నిలకడగా ఆడటమే మన లక్ష్యం అయి ఉండాలి. అప్పుడే మన ఆట పట్ల సంతృప్తి చెందొచ్చు’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ఒక నిర్ధిష్ట దశకు చేరుకున్న తర్వాత ఆటలో మరింత పరిణతి వస్తుందన్నాడు.