ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌లో టాప్‌‌‌‌లో కోహ్లీ

దుబాయ్‌‌‌‌: టీమిండియా కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌లో నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లోనే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 870 పాయింట్లు ఉన్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌లో రెండు హాఫ్‌‌‌‌ సెంచరీలు చేయడం విరాట్‌‌‌‌కు కలిసొచ్చింది. హ్యామ్‌‌‌‌స్ట్రింగ్‌‌‌‌ ఇంజ్యురీతో ఆసీస్‌‌‌‌ టూర్‌‌‌‌కు దూరంగా ఉన్న హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ (842) రెండో ర్యాంక్‌‌‌‌లో ఉన్నాడు. పాక్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ (837) మూడో ర్యాంక్‌‌‌‌ దక్కించుకున్నాడు. వన్డే వరల్డ్‌‌‌‌ కప్​ తర్వాత ఫస్ట్​ సిరీస్​ ఆడిన ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యా (553).. టాప్‌‌‌‌–50లోకి దూసుకొచ్చాడు. లేటెస్ట్‌‌‌‌ లిస్ట్​లో 49వ స్థానంలో నిలిచాడు. ఆసీస్‌‌‌‌పై 90, 92 రన్స్‌‌‌‌ చేయడం పాండ్యా ర్యాంక్‌‌‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది. ఆసీస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ ఆరోన్‌‌‌‌ ఫించ్‌‌‌‌ (791) ఐదో ర్యాంక్‌‌‌‌కు ఎగబాకాడు. వరుసగా రెండు సెంచరీలు చేసిన స్టీవ్‌‌‌‌ స్మిత్‌‌‌‌ (707)…15వ ర్యాంక్‌‌‌‌లో ఉన్నాడు. మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ (684).. 20వ ర్యాంక్‌‌‌‌కు చేరాడు. బౌలింగ్‌‌‌‌లో జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా (700) థర్డ్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌లో ఉండగా, పేసర్‌‌‌‌ ట్రెంట్‌‌‌‌ బౌల్ట్‌‌‌‌ (722), స్పిన్నర్‌‌‌‌ ముజీబుర్‌‌‌‌ రెహమాన్‌‌‌‌ (701) టాప్‌‌‌‌–2లో కొనసాగుతున్నారు. ఆసీస్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ ఆడమ్‌‌‌‌ జంపా (623).. ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ టాప్‌‌‌‌–20లోకి దూసుకొచ్చి 14వ ర్యాంక్‌‌‌‌ను దక్కించుకున్నాడు. హేజిల్‌‌‌‌వుడ్‌‌‌‌ (660) ఆరో ర్యాంక్‌‌‌‌లో నిలిచాడు.

For More News..

బైడెన్ సర్కారులో కీలక పదవిలో ఇండో-అమెరికన్

అమెరికాలో కరోనాతో ఒక్కరోజే 3,260 మంది బలి

నేడు రోహిత్​కు ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ టెస్ట్‌‌‌‌