Virat Kohli: బాలీవుడ్ స్టార్లు వెనక్కి.. భారత అత్యంత విలువైన సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ

Virat Kohli: బాలీవుడ్ స్టార్లు వెనక్కి.. భారత అత్యంత విలువైన సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో పరుగుల వరద పారించడమే కాదు, ఆస్తులు వెనుకేసుకోవడంలోనూ జోరు కనపరుస్తున్నాడు. భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, రణవీర్ సింగ్‌లను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. కన్సల్టెన్సీ సంస్థ క్రోల్ నివేదిక ప్రకారం, విరాట్ బ్రాండ్ విలువ గతేడాది దాదాపు 29 శాతం పెరిగింది.

2023లో విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ 227.9 మిలియన్ల అమెరికన్ డాలర్లుగా అంచనా వేయబడింది. ఈ జాబితాలో 203.1 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో రణ్‌వీర్ సింగ్ రెండో స్థానంలో ఉండగా, బాలీవుడ్ బాద్‌షా, ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్ 120.7 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. 

ఏడో స్థానంలో ధోనీ

ఈ జాబితాలో మాజీ దిగ్గజాలు ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. ధోనీ బ్రాండ్ విలువ 95.8 మిలియన్ డాలర్లు కాగా, సచిన్ 91.3 మిలియన్ డాలర్లతో జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.

2023 సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్(అమెరికన్ డాలర్లలో..)

  • 1. విరాట్ కోహ్లి: 227.9 మిలియన్
  • 2. రణవీర్ సింగ్: 203.1 మిలియన్
  • 3. షారూఖ్ ఖాన్: 120.7 మిలియన్
  • 4. అక్షయ్ కుమార్: 111.7 మిలియన్
  • 5. అలియా భట్: 101.1 మిలియన్
  • 7.ఎంఎస్ ధోని: 95.8 మిలియన్
  • 8. సచిన్ టెండూల్కర్: 91.3 మిలియన్
  • 9. అమితాబ్ బచ్చన్: 83.6 మిలియన్
  • 10. సల్మాన్ ఖాన్: 81.7 మిలియన్
  • 18. రోహిత్ శర్మ: 41.0 మిలియన్
  • 19. హార్దిక్ పాండ్యా: 38.4 మిలియన్