విరాట్ కోహ్లీ కోసం స్పెషల్‌ ఫ్లైట్.. కారణం ఏంటంటే?

విరాట్ కోహ్లీ కోసం స్పెషల్‌ ఫ్లైట్.. కారణం ఏంటంటే?

వెస్టిండీస్‌ పర్యటనను విజయవంతంగా ముగించిన భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ స్వదేశానికి చేరుకున్నారు. అయితే కోహ్లీ ఎప్పటిలాగా కమర్షియల్‌ ఫ్లయిట్‌లో కాకుండా.. ఈసారి తన కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ చార్టర్డ్‌ ఫ్లైట్‌లో స్వదేశానికి వచ్చారు.

గ్లోబల్‌ ఎయిర్‌ చార్టర్‌ స‌ర్వీసెస్ సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో కోహ్లీ స్వదేశానికి చేరుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేసిన కోహ్లీ.. ప్రత్యేక ఏర్పాట్లు చేసినందుకు గ్లోబల్‌ ఎయిర్‌ చార్టర్‌ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. తన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఏసీఎస్‌ ఎయిర్‌ చార్టర్‌, కెప్టెన్‌ అబు పటేల్‌కు ధ్యాంక్స్‌.. అని కోహ్లీ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

8 గంటలకు పైగా విమానాశ్రయంలోనే పడిగాపులు

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ ముగిసిన అనంతరం తొలి వన్డేకు బయలుదేరిన సమయంలో భారత ఆటగాళ్లు విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. దాదాపు 8 గంటల పాటు విమానాశ్రయంలో పడిగాపులు కాశారు. దీనిపై జట్టు సభ్యులతో పాటు మేనేజ్‌మెంట్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే గ్లోబల్‌ ఎయిర్‌ చార్టర్‌ సంస్థ అతని కోసం స్పెషల్‌ ఫ్లైట్ ఏర్పాటు చేసినట్లు వార్తలొస్తున్నాయి.

విండీస్‌తో జరిగిన రెండో టెస్ట్(కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్‌)లో 76వ శతకం బాదిన కోహ్లీ.. ఇక నేరుగా ఆసియాకప్‌లో బ‌రిలోకి దిగ‌నున్నారు. ఆసియా కప్‌(Asia Cup 2023) పర్యటనకు బయలుదేరడానికి దాదాపు రెండు వారాల గడువు ఉండడంతో.. కోహ్లీ అప్పటివరకూ కుటుంబసభ్యులతో గడపనున్నారు.