IPL 2024: నన్ను అలా పిలవొద్దు..నాకు ఇబ్బందిగా ఉంటుంది: ఫ్యాన్స్‌కు కోహ్లీ రిక్వెస్ట్

IPL 2024: నన్ను అలా పిలవొద్దు..నాకు ఇబ్బందిగా ఉంటుంది: ఫ్యాన్స్‌కు కోహ్లీ రిక్వెస్ట్

టీమిండియాలో విరాట్ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విరాట్.. రెండు నెలల తర్వాత ఇండియాలోకి అడుగు పెట్టాడు. నిన్న బెంగళూరు చేరుకొని ప్రాక్టీస్ క్యాంప్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత బెంగళూరులో నిన్న ( మార్చి 19) ఏర్పాటు చేసిన క్యాంప్‌లో RCB ఆటగాళ్లు సమావేశమయ్యారు. కొత్త IPL సీజన్ కోసం తమ సన్నాహాల గురించి చర్చించారు.

మంగళవారం(మార్చి 19) ఆర్సీబీ అన్‌బాక్స్ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారి కొత్త జెర్సీని ఆవిష్కరించింది. స్మృతి మంధాన సారథ్యంలోని జట్టు తమ తొలి డబ్ల్యూపీఎల్ టైటిల్ అందుకోవడంతో ఆర్సీబీ మహిళల జట్టు  చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకుల నుండి ఘనస్వాగతం పొందింది. విరాట్ చాలా రోజుల తర్వాత కనిపించడంతో ఆర్సీబీ అన్​బాక్స్ ఈవెంట్​కు ఎప్పుడూ లేనంత హైప్ నెలకొంది. ఇక ఈ వేదికపై కోహ్లీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ALSO READ :- IPL 2024: అతడికే బాధ్యతలు: కెప్టెన్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్

 
తన స్పీచ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు కోహ్లీ ఊహించని షాక్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కింగ్ లా ఉండడం ఎలా అనిపిస్తుంది అని ఒక యాంకర్ అడగగా.. స్టేడియంలోని ఫ్యాన్స్ అంతా ‘కోహ్లీ.. కోహ్లీ’ అంటూ గట్టిగా అరిచారు. దీనికి కోహ్లీ సమాధానమిస్తూ " అందరూ కాస్త నిశబ్ధంగా ఉండాలి. మీరు నన్ను కింగ్ అని పిలిచినప్పుడల్లా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దయచేసి నన్ను విరాట్ అని పిలవండి". అని అన్నాడు. అయితే ఫ్యాన్స్ హర్ట్ అవ్వకూడదని ఈ విషయాన్ని కోహ్లీ చాలా కూల్ గా చెప్పినట్టు అర్ధమవుతుంది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ లో తమ తొలి మ్యాచ్ ను మార్చి 22న డిఫెండింగ్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. 2023 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిపోయిన ఆర్సీబీ.. ఈ సారి టైటిల్ గెలవాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.