AUS vs IND: రాహుల్ ఔట్.. గ్రౌండ్‌ వరకు వచ్చి వెనక్కి వెళ్లిన కోహ్లీ

AUS vs IND: రాహుల్ ఔట్.. గ్రౌండ్‌ వరకు వచ్చి వెనక్కి వెళ్లిన కోహ్లీ

అడిలైడ్ టెస్టులో ఒక గమ్మత్తయిన సంఘటన ఒకటి జరిగింది. ఇన్నింగ్స్ 7 ఓవర్లో ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ తొలి బంతికే రాహుల్ ని ఔట్ చేశాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ వేసిన ఒక అద్భుత బంతిని ఆడే క్రమంలో రాహుల్ బ్యాట్ ఎడ్జ్ అయ్యి వికెట్ కీపర్ కు క్యాచ్ వెళ్ళింది. ఈ సమయంలో కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి వెంటనే గ్రౌండ్ వరకు వచ్చాడు. రాహుల్ కూడా ఔట్ అని పెవిలియన్ కు వెళ్తున్నాడు. అయితే ఈ సమయంలో అంపైర్ నో బాల్ అని ప్రకటించాడు. 

ఇది గ్రహించిన కోహ్లీ మళ్ళీ వెంటనే డ్రెసింగ్ రూమ్ వైపు దిశగా వెళ్ళాడు. రాహుల్ వెనక్కి వచ్చి బ్యాటింగ్ కొనసాగించాడు. కాసేపు హడావుడిగా సాగిన ఈ సంఘటన అందరినీ గందరగోళానికి గురి చేసింది. ఇదిలా ఉంటే ఎట్టకేలకు స్టార్క్ బౌలింగ్ లో రాహుల్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 64 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ 7 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. 

ప్రస్తుతం భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్ (31), పంత్ (0) ఉన్నారు. జైశ్వాల్ (0), కోహ్లీ (7) విఫలమయ్యారు. రాహుల్ 39 పర్వాలేదనిపించగా.. గిల్ 31 లతో రాణించి క్రీజ్ లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ కు మూడు వికెట్లు దక్కాయి.