T20 World Cup 2024 Final: విజయం తర్వాత భావోద్వేగం.. ఫ్యామిలీతో కోహ్లీ వీడియో కాల్

T20 World Cup 2024 Final: విజయం తర్వాత భావోద్వేగం.. ఫ్యామిలీతో కోహ్లీ వీడియో కాల్

11 ఏళ్ళ తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంది. 2013 లో ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు 11 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత 2024 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. బార్బడోస్ వేదికగా సౌతాఫ్రికాపై శనివారం (జూన్ 29) జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో కోహ్లీకి ప్రత్యేకమని చెప్పాలి. దశాబ్ద కాలంగా తన బ్యాటింగ్ తో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన కోహ్లీ..నిన్నటితో 11 ఏళ్ళ తర్వాత ఐసీసీ టైటిల్ అందుకున్నాడు. దీంతో భావోద్వేగానికి గురయ్యాడు. 

మ్యాచ్ అనంతరం కోహ్లీ తన సంతోషాన్ని ఫ్యామిలీతో పంచుకున్నాడు. అతని భార్య అనుష్క శర్మతో మాట్లాడుతున్న వీడియో కాల్ మాట్లాడుతూ కనిపించాడు. తమ పిల్లలకు వీడియో కాల్ లో సంతోషంతో మాట్లాడుతున్న వీడియో వైరల్ గా మారింది. వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు కోహ్లీ తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం మనం చూడవచ్చు. కోహ్లీ తన ఫ్యామిలీతో వీడియో కాల్ మాట్లాడడం ఇదే తొలి సారి కాదు. గతంలోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ కు చేరుకున్నప్పుడు వీడియో కాల్ మాట్లాడాడు. 

టోర్నీ మొత్తం విఫలమైన కోహ్లీ ఫైనల్లో సత్తా చాటాడు. 59 బంతుల్లో76 పరుగులు చేసి భారత్ ను ఆదుకున్నాడు. విరాట్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి. ఒకదశలో భారత్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్ పటేల్, శివమ్ దూబేలతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 176 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. కోహ్లీతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో సౌతాఫ్రికాపై జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో గెలిచి రెండో టీ20 వరల్డ్ కప్ అందుకుంది.