Virat Kohli: క్రీడల్లో కోహ్లీ టాప్.. దేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారులు వీరే

Virat Kohli: క్రీడల్లో కోహ్లీ టాప్.. దేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారులు వీరే

ఫార్చ్యూన్ ఇండియా నివేదిక ప్రకారం భారత క్రీడల్లో టీమిండియా సూపర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి అత్యధిక పన్ను చెల్లించాడు. అతను రూ. 66 కోట్ల పన్ను చెల్లించాడు. దీంతో భారతీయ క్రీడాకారులలో అత్యధిక పన్ను చెల్లించే ఆటగాడిగా నిలిచాడు. 2024 నాటికి విరాట్ కోహ్లీ మొత్తం సంపాదన విలువ రూ. 1,000 కోట్లకు మించి ఉంటుందని అంచనా.

ఓవరాల్ గా కోహ్లీ ఈ లిస్ట్ లో ఐదో స్థానంలో నిలిచాడు. షారుక్ ఖాన్, తలపతి' విజయ్, సల్మాన్ ఖాన్,అమితాబ్ బచ్చన్ కోహ్లీ కంటే ముందున్నారు. బాలీ వుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ రూ. 92 కోట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత తమిళ నాడు సూపర్ స్టార్ తలపతి విజయ్ 80 కోట్లతో రెండో స్థానంలో నిలిచాడు. సల్మాన్ ఖాన్ 75 కోట్లు.. అమితాబ్ బచ్చన్ రూ 71 కోట్లు చెల్లించారు.

Also Read :- రైల్వే ఉద్యోగానికి రాజీనామా

ఇతర భారత క్రికెటర్లలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 7 స్థానంలో కొనసాగుతున్నాడు. ధోనీకి ఇష్టమైన నెంబర్ 7 కావడంతో అతని అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో "థలా ఫర్ రీజన్" అని తెగ వైరల్ చేస్తున్నారు. దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ రూ. 28 కోట్లు.. సౌరవ్ గంగూలీ రూ. 23 కోట్లు టాక్స్ చెల్లిస్తున్నారు. హార్దిక్ పాండ్యా రూ. 13 కోట్లు.. రిషబ్ పంత్ రూ 10 కోట్లు చెల్లించారు.