మరో అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

మరో అరుదైన  రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

పరుగుల మిషన్ విరాట్ కొహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు.  ఇప్పటి వరకు  టెస్టు, వన్డే, టీ20ల్లో 499  ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన కొహ్లీ జూలై 20న 500 మ్యాచ్ ఆడి రికార్డ్ సృష్టించనున్నాడు.  వెస్టిండీస్ తో జూలై 20న జరిగే రెండో టెస్టు ఆడటంతో కొహ్లీ అన్ని ఫార్మాట్లలో  500 మ్యాచ్ లు ఆడిన  పదో ఆటగాడిగా  ఘనత సాధించనున్నాడు. 

ALSO READ :తెలంగాణ సంప్రదాయాలను కాపాడుకోవాలి : మంత్రి హరీశ్​రావు

కొహ్లీ కంటే  ముందు సచిన్ 664 మ్యాచ్ లు, జయవర్ధనే 652(శ్రీలంక), సంగక్కర 594(శ్రీలంక),  పాంటింగ్ 560(ఆస్ట్రేలియా), ధోనీ 538(ఇండియా),  ఆఫ్రిదీ 524(పాకిస్తాన్),  జాక్ కలిస్ 519(సౌతాఫ్రికా), ద్రవిడ్ 509(ఇండియా), ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

కొహ్లీ ఇప్పటి వరకు 110 టెస్టుల్లో 8555 పరుగులు, 274 వన్డేల్లో 12898 పరుగులు, 115 టీ20లు ఆడి 4008 పరుగులు చేశాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో కలిపి 25461 పరుగులు చేశాడు.