వరల్డ్ కప్ లో నిన్న భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ కు స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది. ఇది నాకౌట్ సమరం కాకపోయినా , కీలక మ్యాచ్ కాకున్నా ఈ మ్యాచ్ చూడడానికి జనాలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. విరాట్ కోహ్లీ పుట్టిన రోజు కావడం.. 49 వ సెంచరీ చేసి సచిన్ రికార్డ్ సమం చేస్తాడనే నమ్మకం.. ఫామ్ లో ఉన్న దక్షిణాఫ్రికాపై ఎలా ఆడతారు అనే అంశాలు ఈ మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశాయి. అయితే ఆన్ లైన్ లో కూడా ఈ మ్యాచ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ ను డిస్నీ+ హాట్‌స్టార్ క్రికెట్ స్ట్రీమింగ్‌లో 4.4 కోట్ల మంది వీక్షించడం విశేషం. ఇదే వరల్డ్ కప్ లో అక్టోబర్ 14, 2023న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ను 3.5 కోట్ల మంది వీక్షిస్తే.. ఈ రికార్డ్ ను బద్దలు కొడుతూ ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ ను డిస్నీ+ హాట్‌స్టార్ లో 4.3 మంది వీక్షించారు. అయితే తాజాగా నిన్న(నవంబర్ 5) జరిగిన భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ 4.4 కోట్ల మంది వీక్షించడంతో ఈ రికార్డ్ కూడా బ్రేక్ చేసి వ్యూవర్‌షిప్‌లో టాప్ గా నిలిచింది.
విరాట్ కోహ్లీ 49 వ సెంచరీ చేసే సమయంలో ఈ వ్యూవర్‌షిప్ 4.4 కోట్లకు చేరింది. డిస్నీ+ హాట్‌స్టార్ హెడ్ సజిత్ శివానందన్ మాట్లాడుతూ, "ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 సందర్భంగా మా వినియోగదారులు క్రికెట్ స్ట్రీమింగ్‌లో మమ్మల్ని నిలకడగా కొత్త శిఖరాలకు చేర్చారు. ఇండియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ ను 4.4 కోట్ల మంది వీక్షించడం ఆనదంగా ఉందని తెలిపాడు.