ఢిల్లీలో ఇప్పుడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ట్రెండింగ్ లో ఉన్నాడు. గురువారం (జనవరి 30) సూరజ్ అహుజా రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా 12 ఏళ్ళ తర్వాత విరాట్ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగడంతో అతని క్రేజ్ ఆకాశాన్ని దాటేసింది. ఉదయం నాలుగు గంటల నుంచే ఫ్యాన్స్ స్టేడియంలోకి రావడానికి క్యూ కట్టారు. ఈ క్రమంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మ్యాచ్ కు ముందు తొక్కిసలాటలో కొంతమంది అభిమానాలు గాయపడ్డారు. ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో అక్కడ ఉన్న భద్రత అధికారులకు కూడా గాయాలయ్యాయి.
మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కూడా ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక అభిమాని భద్రతను దాటుకొని కోహ్లీని కలవడానికి మైదానంలోకి వేగంగా పరిగెత్తుకుని వచ్చాడు. ఇంతలో సెక్యురిటీ అతడి వెనకాలే పరిగెత్తాడు. సెక్యూరిటీ తనను పట్టుకునే లోపే ఆ అభిమాని కోహ్లీ దగ్గరకు వచ్చి అతని పాదాలను తాకాడు. ఆ అభిమానిని జాగ్రత్తగా తీసుకువెళ్ళమని సెక్యూరిటీ కోహ్లీకి సూచించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మైదానంలో కోహ్లీకి ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడేటప్పుడు కోహ్లీకి ఇలా చాలా సార్లు జరిగింది.
ALSO READ : Virat Kohli: కోహ్లీని చూడడానికి ఎగబడ్డ జనం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
మ్యాచ్ కు ముందు అరుణ్ జైట్లీ స్టేడియం వెలుపల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 16 వ గేట్ లోపల ప్రేక్షకులు ఒకరినొకరు తోసుకుంటున్నప్పుడు గాయాలయ్యాయి. ఎంట్రీ గేట్ వద్ద ఇద్దరు అభిమానులు గాయపడినట్టు సమాచారం. ఒక పోలీసు బైక్ ధ్వంసం కాగా.. కొంతమంది వారి బూట్లు వదిలి వెళ్లారు. గాయపడిన అభిమానులకు గేటు దగ్గర డీడీసీఏ సెక్యూరిటీ, పోలీసులు చికిత్స అందించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో సెక్యూరిటీ గార్డు కూడా గాయపడ్డాడు.
A fan entered the ground to meet Virat Kohli & he touched Kohli's feet. 🥹❤️#ViratKohlipic.twitter.com/3GqkYNKsh6
— Viratians™ CR7 𝕏 (@vira_tians) January 30, 2025