IND vs NZ 3rd Test: ఫామ్‌లో లేకపోగా బ్యాడ్‌లక్ ఒకటి.. చేజేతులా వికెట్ పారేసుకున్న కోహ్లీ

IND vs NZ 3rd Test: ఫామ్‌లో లేకపోగా బ్యాడ్‌లక్ ఒకటి.. చేజేతులా వికెట్ పారేసుకున్న కోహ్లీ

టెస్టుల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతుంది. పరుగులు చేయడానికి తంటాలు పడుతున్న విరాట్ మరోసారి నిరాశ పరిచాడు. ముంబై టెస్టులో న్యూజిలాండ్ పై కేవలం నాలుగు పరుగులే చేసి ఔటయ్యాడు. అసలే ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న కోహ్లీకి ఈ సారి రనౌట్ రూపంలో దురదృష్టం వెంటాడింది. అజాజ్ పటేల్ బౌలింగ్ లో మిడాన్ దిశగా బంతిని కొట్టి రిస్కీ సింగిల్ కోసం పరిగెత్తాడు. అయితే మిడాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న హెన్రీ బంతిని నేరుగా వికెట్లకేసి కొట్టాడు. 

ఈ దశలో కోహ్లీ డైవ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. నిర్ణీత సమయంలో బ్యాట్ క్రీజ్ లో పెట్టకపోవడంతో థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. దీంతో నాలుగు పరుగులకే కోహ్లీ పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. ఈ సిరీస్ లో ఒక్క హాఫ్ సెంచరీ మినహాయిస్తే కోహ్లీ మిగిలిన నాలుగు ఇన్నింగ్స్ ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. మ్యాచ్ మరో 3 ఓవర్లలో ముగుస్తుందనగా.. కోహ్లీ ఔట్ కావడం భారత అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది. కోహ్లీకి ముందు నాలుగో స్థానంలో సిరాజ్ ను పంపించినా అతను తొలి బంతికే ఔటయ్యాడు. కోహ్లీ ఔట్ కావడంతో తొలి రోజు భారత్ కష్టాల్లో పడింది. 

తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. క్రీజ్ లో పంత్ (1), గిల్ (31) ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 149 పరుగులు వెనకబడి ఉంది.  వికెట్ నష్టానికి 78 పరుగులతో పటిష్టంగా కనిపించిన భారత్ ఆట ముగిసి సమయానికి 4 వికెట్లకు 86 పరుగులతో రోజు ముగించింది. అంత ముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులకు ఆలౌటైంది.