
బెంగళూరు : దాదాపు రెండు నెలల గ్యాప్ తర్వాత టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ తిరిగి గ్రౌండ్‌లోకి వచ్చాడు. భార్య అనుష్క డెలివరీ కోసం లండన్ వెళ్లి ఇండియాకు తిరిగొచ్చిన విరాట్ సోమవారం చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ ట్రెయినింగ్ సెషన్‌లో పాల్గొన్నాడు. గ్రౌండ్‌లో తోటి ఆటగాళ్లతో కలిసి ఉత్సాహంగా వామప్ చేస్తూ కనిపించాడు. ఈ సెషన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ ఫా డుప్లెసిస్ కూడా పాల్గొన్నాడు. ఈ నెల 22న జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్‌సీబీ తలపడనుంది. జూన్‌లో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ లీగ్‌లో కోహ్లీ ఆటను సెలెక్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. జనవరిలో అఫ్గానిస్తాన్‌తో టీ20 మ్యాచ్‌లో పాల్గొన్న విరాట్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.