![IND vs ENG: రెండో వన్డేకు కోహ్లీ సిద్ధం.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు](https://static.v6velugu.com/uploads/2025/02/virat-kohlis-possible-return-against-england-in-the-second-odi-in-cuttack_PoYcGjslSe.jpg)
ఇంగ్లాండ్ తో రెండో వన్డే కోసం టీమిండియా సిద్ధమవుతుంది. ఆదివారం (ఫిబ్రవరి 9) కటక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడడం దాదాపుగా ఖాయమైంది. కోహ్లీ టీమిండియాతో కలిసి కటక్ చేరుకున్నాడు. మోకాలి నొప్పి కారణంగా తొలి వన్డేకు విరాట్ దూరమైన సంగతి తెలిసిందే. అతను జట్టులో చేరడంతో ఇప్పుడు కోహ్లీ ఎవరి స్థానంలో ఆడతాడనే విషయంలో గందరగోళం నెలకొంది.
కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ వచ్చి అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 36 బంతుల్లోనే 59 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మరోవైపు తొలి వన్డేలో జైశ్వాల్ ఆకట్టుకొలేకపోయాడు. గిల్, రోహిత్, రాహుల్ స్థానాలకు ఎలాంటి ఢోకా లేదు. దీంతో కోహ్లీ జట్టులోకి వస్తే అయ్యర్ లేదా జైశ్వాల్ లో ఒకరిపై వేటు తప్పదు. అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించాడు కాబట్టి జైశ్వాల్ బెంచ్ కు పరిమితం కావొచ్చు. బౌలింగ్ లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేకపోవచ్చు.
యధావిధిగా రోహిత్ తో కలిసి గిల్ ఓపెనింగ్ చేస్తాడు. కోహ్లీ, అయ్యర్, రాహుల్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్ కొనసాగుతారు. ఏకైక స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు తుది జట్టులో స్థానం గ్యారంటీ. హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను మోయనున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ ఫాస్ట్ జట్టులోకి మార్క్ వుడ్ వచ్చే అవకాశం ఉంది. మూడు వన్డేల సిరీస్ లో ప్రస్తుతం భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
రెండో వన్డే కోసం భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హర్షిద్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ
ఇంగ్లాండ్:
జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, ఫిలిప్ సాల్ట్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, లియామ్ లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్