మన ఆత్మ గౌరవం కోసం ఆడినం : విరాట్ కోహ్లీ

బెంగళూరు : తొలి ఎనిమిది మ్యాచ్‌‌‌‌ల్లో ఏడు ఓటముల తర్వాత అంతా శూన్యంగా కనిపిస్తున్న సమయంలో తమ ఆత్మ గౌరవం కోసం ఆడి ఆర్‌‌‌‌‌‌‌‌సీబీని ప్లే ఆఫ్స్‌‌‌‌ వరకు తీసుకు రాగలిగామని ఆ టీమ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెప్పాడు. వరుసగా ఆరు విజయాలతో  ప్లేఆఫ్స్‌‌‌‌కు వచ్చిన ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌ చేతిలో ఓడింది. ఈ మ్యాచ్‌‌ తర్వాత కోహ్లీ ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌‌‌‌లో తోటి ఆటగాళ్లతో మాట్లాడాడు.

‘సీజన్ మధ్యలో అన్ని ఓటముల తర్వాత  మనమంతా మన ఆత్మ గౌరవం కోసం ఆడటం మొదలెట్టాం. అప్పుడే ఆత్మ విశ్వాసం తిరిగి వచ్చింది. అన్ని అవాంతరాలను దాటుకొని ప్లేఆఫ్స్‌‌‌‌కు క్వాలిఫై అయిన విధానం  నిజంగా చాలా ప్రత్యేకం. దీన్ని నేనెప్పటికీ గుర్తుంచుకుంటా.

ఎందుకంటే  ప్లేఆఫ్స్ బెర్తు కోసం ఈ టీమ్‌‌‌‌లోని ప్రతీ ఆటగాడు తన ప్రాణం పెట్టి పోరాడాడు. అది మనందరికీ గర్వకారణం. చివరకు మనం ఆడాలనుకున్న విధంగా ఆడాము’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.