IND vs BAN 2024: బలహీనతను బయటపెట్టిన కోహ్లీ.. మరోసారి అదే రీతోలో ఔట్

IND vs BAN 2024: బలహీనతను బయటపెట్టిన కోహ్లీ.. మరోసారి అదే రీతోలో ఔట్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన బలహీనతను బయట పెట్టాడు. ఆఫ్-స్టంప్ వెలుపల పడుతున్న బంతులను హిట్ చేయాలని చూస్తూ.. కీపర్ లేదా స్లిప్ క్యాచ్ ఔట్ అవ్వడం తరచూ చూస్తూనే ఉంటాం. ఎప్పటి నుంచో విరాట్ కు ఈ బలహీనత ఉంది. అతని మైనస్ పాయింట్ పూర్తిగా బౌలర్లు పసిగట్టారు. తాజాగా గురువారం (సెప్టెంబర్ 19) నేడు బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ కోహ్లీ ఇదే సీన్ రిపీట్ చేశాడు.   

బంగ్లా ఫాస్ట్ బౌలర్ హసన్ మహమ్మద్ బౌలింగ్ లో దూరంగా వెళ్తున్న బంతిని ఆడబోయి ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్ అవతల పడ్డ బంతిని ఆడే క్రమంలో బంతి బ్యాట్‌కు ఎడ్జ్ అయి నేరుగా కీపర్ లిటన్ దాస్ చేతిలోకి వెళ్లింది. దీంతో 6 పరుగులకే కింగ్ పెవిలియన్ కు చేరాడు. కోహ్లీ ఔట్ కావడంతో భారత్ 32 పరుగులకే 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. వినడానికి షాకింగ్ గా అనిపించినా కోహ్లీ ఇదే రీతిలో ఔట్ కావడం ఇది 50 వ సారి. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి.. దిగ్గజ హోదాలో ఉన్న విరాట్ తన బలహీనతను అధిగమించలేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. 

దాదాపు సంవత్సరం తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్న కోహ్లీ 6 పరుగులకే ఔటవ్వడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కోహ్లీ ప్లీజ్ ఇంకా మేము నిన్నిలా చూడలేమంటూ ట్విట్టర్లో గగ్గోలు పెడుతున్నారు. బౌలర్ ఎవరైనా.. ప్రత్యర్థి ఏదైనా కోహ్లీ  ఆఫ్ స్టంప్ అవతల పడ్డ బంతిని ఎదుర్కోవడంలో విఫమవుతూనే ఉన్నాడు. ఓ వైపు రూట్, విలియంసన్, స్టీవ్ స్మిత్ టెస్టుల్లో దూసుకుపోతుంటే కోహ్లీ మాత్రం వెనకపడిపోతున్నాడు. రానున్న కీలక సిరీస్ లో కోహ్లీ ఈ బలహీనతను అధిగమించకపోతే భారత్ కష్టాల్లో పడినట్టే.