
జైపూర్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. రాజస్తాన్‌లోని జైపూర్‌లోని వ్యాక్స్ మ్యూజియంలో అతని మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని నెలకొల్పామని మ్యూజియం ఫౌండర్, డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ వెల్లడించారు. 35 కేజీల బరువు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు రెండు నెలల టైమ్ పట్టిందని తెలిపాడు.