విరాట‌ప‌ర్వం ట్రైల‌ర్‌: యుద్ధం నాకు ప్రాణం పోసింది..

విరాట‌ప‌ర్వం ట్రైల‌ర్‌: యుద్ధం నాకు ప్రాణం పోసింది..
  • నా కళ్లలో నిజాయితీ, ప్రేమ కనిపిస్త లేదా? 
  • నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తలరాతలో మాత్రం కచ్చితంగా నేనే ఉన్నా
  • ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది, కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది

చిన్న ఎవడు? పెద్ద ఎవడు? రాజ్యమేలే రాజు ఎవడు? సామ్యవాద పాలననే స్థాపించగ ఎన్నినాళ్లంటూ వస్తున్నాడు నటుడు దగ్గుబాటి రానా.  ఆయన తాజాగా నటించిన చిత్రం విరాట పర్వం. సాయిపల్లవి హీరోయిన్. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఆదివారం (జూన్‌ 5) విడుదలైంది. నక్సలిజం నేపథ్యంలో సాగే ఈ విరాటపర్వంలో కామ్రేడ్‌ రవన్నగా  రానా , అతడి రచనలను ఇష్టపడే అభిమాని వెన్నెల పాత్రలో సాయిపల్లవి నటించారు. 1990లో జరిగిన యదార్థ సంఘటన స్పూర్తితో మూవీని రూపొందించారు. 


 
రానా రాసే పుస్తకాలకు అభిమానిగా మారిన సాయిపల్లవి ...పుస్తకం రాసినోడిని చూడాలనుంది..అతన్ని కనిపించేలా చేస్తే కోడిని కోసి కల్లు సాక పోస్తానని అమ్మవారికి మొక్కుకుంటుంది. ఆ తర్వాత రవన్న దళం ఊర్లో దిగుతుంది. నీకు నేను అభిమానిని అయిపోయా.. నాలో ఏదో భావోద్వేగం రగులుతోంది.. ఈ భావోద్వేగానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియడం లేదంటూ చెప్పే డైలాగ్ ఆసక్తిని కలిగిస్తోంది.  ఇక నక్సలైట్ల వల్ల ఏమన్న ఉపయోగం ఉందా? అని ఓ పోలీసు అడగ్గా.. 'మా ఊర్ల ఆడోళ్ల మీద అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు ఏ పార్టొల్లు వచ్చిర్రు సర్.. మా అన్నలు వచ్చిర్రు అంటూ రాహుల్‌ రామకృష్ణ చెప్పిన తీరు అందరిని టచ్ చేసేలా ఉంది. అయితే రానా ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తిని పొందడం కోసం  సాయిపల్లవి కూడా నక్సలైట్‌గా మారుతుంది.  కామ్రెడ్ గా మారి నిత్యం యుద్దం చేస్తున్న  హీరో వెన్నెల ప్రేమను అర్థం చేసుకుంటాడా అనేది ఆసక్తిక్తరంగా మారింది.

నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తలరాతలో మాత్రం కచ్చితంగా నేనే ఉన్నా', 'ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది, కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది' అన్న డైలాగ్స్‌ వింటే విజిల్స్ వేయకమానరు. నా కళ్లలో నిజాయితీ కనిపిస్త లేదా.. ప్రేమ కనిపిస్త లేదా? అని సాయి పల్లవి అడిగినప్పుడు... ఇక్కడ రాత్రి ఉండదు పగలు ఉండదు.. ఉన్నదల్లా ఊపిరికి ఊపిరికి మధ్య ఊపిరి సలపనంత యుద్దమే.. అసలు చావు కేకలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? అని రానా చెప్పిన మాటలతో రోమాలు నిక్కపోడుచుకుంటాయి. మొత్తంగా నేను వెన్నెల.. ఇదే నా కథ అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్‌తో..కథ మొత్తం సాయి పల్లవి కోణంలోంచి ఉండబోతుందని తెలుస్తుంది.

డి. సురేష్‌ బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ మూవీకి సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందించారు. నవీన్‌ చంద్ర సీనియర్‌ ఉద్యమకారుడు రఘన్నగా, ప్రియమణి కామ్రేడ్‌ భారతక్కగా నటించారు. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.

మరిన్ని వార్తల కోసం..

F3 'ఫన్'టాస్టిక్..రూ.100 కోట్ల సెలబ్రేషన్స్‌

ఆకట్టుకుంటున్న 'సింబా' ఫస్ట్ లుక్