ఏనాడు ఊహించలేదు.. రోహిత్‌‌‌‌‌‌‌‌తో అనుబంధంపై విరాట్‌‌‌‌‌‌‌‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఏనాడు ఊహించలేదు.. రోహిత్‌‌‌‌‌‌‌‌తో అనుబంధంపై విరాట్‌‌‌‌‌‌‌‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

న్యూఢిల్లీ: పరిస్థితులు ఎలా ఉన్నా తామిద్దరం జట్టు కోసమే పని చేసే వాళ్లమని విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ.. రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మతో ఉన్న తన అనుబంధాన్ని పంచుకున్నాడు. ‘చాలా ఏండ్లుగా మనం ఎవరితోనైనా కలిసి ఆడుతున్నప్పుడు, మీలోని అంతర్‌‌‌‌‌‌‌‌దృష్టిని పంచుకున్నప్పుడు వాళ్లతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇద్దరి కెరీర్‌‌‌‌‌‌‌‌ కూడా ఒకే టైమ్‌‌‌‌‌‌‌‌లో ఉండటం వల్ల ఒకరి నుంచి ఒకరం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఇది చాలా సహజమైన విషయం. 

జట్టుకు నాయకత్వ పరంగా చాలా దగ్గరగా కలిసి పని చేశాం. కాబట్టి మా ఆలోచనలను ఎప్పుడూ చర్చించుకున్నాం. పరిస్థితులు ఎలా ఉన్నా మా ఆలోచనలైతే ఒకేలా ఉండేవి. జట్టు కోసం కలిసి పని చేస్తామనే నమ్మకమైతే ఉండేది’ అని విరాట్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. 15 ఏండ్లు దేశం తరఫున ఆడతామని తాను, రోహిత్‌‌‌‌‌‌‌‌ ఏనాడు ఊహించలేదన్నాడు.