షాకింగ్.. విడాకులు తీసుకోనున్న సెహ్వాగ్.. 20 ఏళ్ల బంధానికి బ్రేకప్?

షాకింగ్..  విడాకులు తీసుకోనున్న సెహ్వాగ్.. 20 ఏళ్ల బంధానికి బ్రేకప్?

భారత మాజీ క్రికెటర్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తి ఆహ్లావత్ తో విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల కాపురానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు సమాచారం. చాలా రోజులుగా సెహ్వాగ్ దంపతులు డివోర్స్ తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం ఈ వార్తకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. 

సెహ్వాగ్, ఆర్తి 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆర్యవీర్, వేదాంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఇటీవల సెహ్వాగ్ దీపావళి వేడుకలు భార్య ఆర్తి లేకుండా కుమారులతో సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదేవిధంగా వారం కిందట పాలక్కడ్ లోని విశ్వ నాగయాక్షి టెంపుల్ కు వెళ్లిన సెహ్వాగ్.. ఆర్తి గురించి మెన్షన్ చేయకపోవడం.. ఫోటోల్లో ఆమె లేకపోవడం వీరి మధ్య దూరం మరింత పెరిగిందనే వార్తలకు బలాన్ని చేకూర్చింది.  

సెహ్వాగ్, ఆర్తి గత ఆరు నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారని సమాచారం. ఫ్యామిలీ ఫంక్షన్స్, పార్టీలు, పండుగ వేడుకలకు సింగిల్ గా అటెండ్ అవుతూ వస్తున్నారు. తాజాగా ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరూ, ఆర్తి డివోర్స్ చేసుకోవడం పక్కా అని సన్నిహితులు అనుకుంటున్నారు. అయితే డివోర్స్ మ్యాటర్ గురించి ఇద్దట్లో ఎవరూ కన్ఫమ్ చేయలేదు. అలాగని ఖండించనూ లేదు. చూడాలి.. డివోర్స్ న్యూస్ పై ఎలా స్పందిస్తారో.