చంద్రుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. ల్యాండర్ విక్రమ్ మాడ్యూల్.. సేఫ్‌గా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. ఈ విజయంతో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఇస్రోపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమవ్వడటం పట్ల టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి ఘన విజయాన్ని భారతీయులకు అందించిన ఇస్రో సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
"yes.. మనం సాధించాం.. చంద్రునిపై అడుగుపెట్టాం.. ఈ చారిత్రాత్మక మిషన్‌కు తమను తాము అంకితం చేసుకున్న ఇస్రో సిబ్బందికి అందరికీ అభినందనలు.." అని సెహ్వాగ్ ట్వీట్ చేశారు.
Yaaaaayyy , We have done it.
— Virender Sehwag (@virendersehwag) August 23, 2023
Soft landing on the Moon.#Chandrayaan3 .
Congratulations @isro and all those who dedicated themselves to this historic mission.
We are on the Moon ? pic.twitter.com/VZLLgeSLEk
The historic moment for India...!!!
— Johns. (@CricCrazyJohns) August 23, 2023
Chandrayaan 3 landed on the moon.pic.twitter.com/KKIt3nys7d