
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వన్డే క్రికెట్ లో తన ఆల్ టైం టాప్ 5 బ్యాటర్స్ ఎవరో చెప్పాడు. ఈ లిస్ట్ లో ఇద్దరు భారత క్రికెటర్లతో పాటు.. పాకిస్థాన్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేశాడు. సనత్ జయసూర్య, రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, సంగక్కర, బ్రియాన్ లారా లాంటి దిగ్గజ బ్యాటర్లను సెహ్వాగ్ పట్టించుకోలేదు. సెహ్వాగ్ టాప్ 5 ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.
క్రిస్ గేల్ (వెస్టిండీస్)
వెస్టిండీస్ పవరే హిట్టర్ క్రిస్ గేల్ కు వీరేంద్ర సెహ్వాగ్ 5వ స్థానంలో చోటు కల్పించాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్ లతో ఎన్నో మ్యాచ్ లను గెలిపించిన గేల్.. 301 వన్డేల్లో 10,480 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు ఉన్నాయి. ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించగల గేల్ కు వన్డేల్లో డబుల్ సెంచరీ (2015 ప్రపంచ కప్‌లో 147 బంతుల్లో 215) చేసిన అరుదైన జాబితాలో నిలిచాడు.
Also Read :- క్రికెట్‌పై 3 లక్షల 20 వేల రూపాయల ప్రశ్న..
ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)
360 డిగ్రీల బ్యాటర్ గా పేరున్న సౌతాఫ్రికా ప్లేయర్ డివిలియర్స్‌కు నాలుగో స్థానంలో సెహ్వాగ్ ఎంచుకున్నాడు. డివిలియర్స్ 228 వన్డేల్లో 101.09 స్ట్రైక్ రేట్‌తో 9,577 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు ఉన్నాయి. తన ఇన్నోవేటివ్ షాట్లతో ప్రపంచాన్ని మంత్ర ముగ్దుల్ని చేసిన డివిలియర్స్ 2021 లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇంజామామ్-ఉల్-హక్ (పాకిస్తాన్)
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌ను సెహ్వాగ్ 3వ స్థానంలో చోటు కల్పించాడు. 1990, 2000 దశకాల్లో ఈ పాక్ దిగ్గజం వన్డేల్లో అద్భుతంగా రాణించి బెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. ఇంజమామ్ 378 వన్డేల్లో 11,739 పరుగులు చేశాడు. వీటిలో 10 సెంచరీలతో పాటు ఏకంగా 83 హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం.
సచిన్ టెండూల్కర్ (ఇండియా)
క్రికెట్ గాడ్.. ఆల్ టైం బెస్ట్ బ్యాటర్ గా సచిన్ టెండూల్కర్ కు పేరుంది. కానీ సెహ్వాగ్ ను సచిన్ 2వ స్థానానికి పరిమితం చేశాడు. వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా సచిన్ ఇప్పటికీ టాప్ లో కొనసాగుతున్నాడు. ఓవరాల్ గా దిగ్గజ టెండూల్కర్ 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. వీటిలో 49 సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ కూడా సచిన్ కావడం విశేషం.
విరాట్ కోహ్లీ (ఇండియా)
కోహ్లీ అత్యంత నిలకడ.. మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యాన్ని గుర్తించి టాప్ ర్యాంక్ ఇచ్చాడు. వన్డేల్లో కోహ్లీ టాప్ బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నాడు. దశాబ్ద కాలంగా భారత బ్యాటింగ్ లైనప్‌కు మూలస్తంభంగా ఉన్న కోహ్లీ.. 58 సగటుతో దాదాపు 14 వేల పరుగులను సాధించాడు. 50 సెంచరీలతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.
Virender Sehwag's Top 5 ODI batsmen of all time (Cricbuzz):
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 17, 2025
1. Virat Kohli.
2. Sachin Tendulkar.
3. Inzamam Ul Haq.
4. AB De Villiers.
5. Chris Gayle. pic.twitter.com/TMIGf72Xzl