
ఐపీఎల్ 2025లో ఇద్దరు విదేశీ స్టార్ క్రికెటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఇప్పటివరకు ఈ సీజన్ లో విఫలమవుతూ వచ్చారు. వీరి పేలవ ఫామ్ కారణంగా స్టార్ ప్లేయరలు అయినప్పటికీ ప్లేయింగ్ 11 లో చోటు కోల్పోయారు. కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తుది జట్టు నుంచి మాక్స్‌వెల్ ను తప్పించారు. ఆదివారం (ఏప్రిల్ 20) పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో లివింగ్ స్టోన్ ను ప్లేయింగ్ 11 నుంచి పక్కన పెట్టారు.
వీరిద్దరి ఆట తీరుపై ఘోరంగా విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే మాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్‌లపై టీమిండియా మాజీ ఓపెనర్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డాడు. క్రిక్‌బజ్‌లో మాట్లాడుతూ.. ఐపీఎల్ నెలల్లో మాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్ సెలవుల కోసం ఇండియాకు వస్తున్నారని ఆరోపించాడు. ఇద్దరు ఆటగాళ్లలో పరుగులు చేయాలనే ఆలోచన లేదని.. వారి ఫ్రాంచైజీకి ట్రోఫీలు గెలుచుకోవాలనే ఆసక్తి వారికి లేదని సెహ్వాగ్ అన్నాడు. ఇద్దరు ఆటగాళ్లు సెలవులు, పార్టీలు చేసుకోవాలనుకుంటున్నారని, తమ ప్రదర్శనలను మెరుగుపరచుకోవాలనే ఆసక్తి వారికి లేదని ఆయన అన్నారు.
ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్, ఏబీ డివిలియర్స్ వంటి ఆటగాళ్ల ఆట తీరును సెహ్వాగ్ ప్రశంసించాడు. విదేశీ ఆటగాళ్లకు వీరు మినహాయిపులని చెప్పాడు. తాను ఢిల్లీ జట్టుకు ఆడుతున్నప్పుడు డేవిడ్ వార్నర్, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మెక్‌గ్రాత్ లాంటి ఆటగాళ్లు నేను మ్యాచ్ గెలిపిస్తాను నన్ను జట్టులో ఆడించండి అని చెప్పారని సెహ్వాగ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. వారు అలా చెప్పినప్పుడు నేను ఎవరిని ఆడించాలి.. ఎవరిని తప్పించాలనే సందిగ్ధంలో ఉండేవాడినని సెహ్వాగ్ తెలిపాడు.
'विदेशी खिलाड़ियों के निजी स्वार्थ #IPL teams को पंहुचा रहे हैं नुकसान,' @VirenderSehwag Cricbuzz Live हिन्दी पर #IPL2025 #PBKSvRCB pic.twitter.com/90ENj8YadT
— Cricbuzz (@cricbuzz) April 20, 2025