![ఢిల్లీలో బీజేపీ గెలిస్తే సీఎం ఎవరు..? క్లారిటీ ఇచ్చిన వీరేంద్ర సచ్దేవా](https://static.v6velugu.com/uploads/2025/02/virendra-sach-deva-clarity-on-delhi-cm-candidate_OFdeV51uE0.jpg)
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కాషాయ పార్టీ అధికారం దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఢిల్లీలో మేజిక్ ఫిగర్ (36 సీట్లు) దాటిన బీజేపీ.. భారీ అధిక్యంలో కొనసాగుతోంది. ఢిల్లీలో బీజేపీ విజయం దాదాపు ఖరారు కావడంతో.. బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ సీఎం క్యాండిడేట్ ఎవరనే దానిపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా కీలక వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వీరేంద్ర సచ్ దేవా శనివారం (ఫిబ్రవరి 8) మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తోందని తెలిపారు. ‘‘ముందస్తు ట్రెండ్స్ మా అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. కానీ ఫలితాల కోసం చివరి వరకు వేచి చూస్తాము. మా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారు.
ALSO READ | Delhi Results: కేజ్రీవాల్ vs పర్వేశ్ సింగ్.. రౌండ్ రౌండ్కూ టెన్షన్
ఈ విజయం మా అగ్ర నాయకత్వానికి అంకితం. మేము ఢిల్లీ సమస్యల ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేశాం. కానీ కేజ్రీవాల్ సమస్యల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. బీజేపీలో సీఎం అభ్యర్థి ఎవరు అనేది పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయిస్తుంది’’ అని సచ్ దేవా పేర్కొన్నారు. ఇక, ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 42, ఆప్ 28 చోట్ల అధిక్యంలో కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు అవసరం.