కన్యారాశి వారికి డబ్బులే డబ్బులు.. విశ్వావసు నామ సంవత్సరంలో భారీగా ఆదాయం

కన్యారాశి వారికి డబ్బులే డబ్బులు.. విశ్వావసు నామ సంవత్సరంలో భారీగా ఆదాయం
  • ఉత్తర 2,3,4 పాదములు; హస్త 1,2,3,4 పాదములు; చిత్త 1, 2 పాదములు, మీ పేరులో మొదటి అక్షరం టో, పా, పి, పూ, షం, ణా, ఠా, పే, పో
  • ఆదాయం : 14
  • రాజపూజ్యం : 6
  • వ్యయం: 2
  • అవమానం : 6

గురువు: 30.03.2025 నుండి 14.05.2025 వరకు రజితమూర్తిగాను తదుపరి 18.10.2025 వరకు తామ్రమూర్తిగా తదుపరి 05.12.2025 వరకు లోహమూర్తిగాను ఉగాది వరకు రజితమూర్తిగా సంచారము.
శని: ఉగాది నుండి మరల ఉగాది వరకు తామ్రమూర్తిగా సంచారము. 
రాహువు 6వ ఇంట రజితమూర్తిగాను కేతువు 12వ ఇంట రజితమూర్తిగా సంచారము.

ఈ రాశి స్త్రీ పురుషులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం. బంధుమిత్రుల ఆనందం. నూతన గృహం. ఆరోగ్యం బాగుంటుంది. రైతు సోదరులు ముహూర్తబలంతో వ్యవసాయం లాభసాటి ఉంటుంది. వృత్తి ఉద్యోగులకు అనూకలంగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లకు అనుకూలొంగా ఉంటుంది. కాంట్రాక్టర్ల అధిక ధన సంపాదనలో ఉంటారు. రాజకీయ నాయకులకు ధనాదాయము బాగుంటుంది. శని రాహు కేతువు ప్రభావం ఉంటుంది. వినాయక, సరస్వతి పూజలు మహన్యాస రుద్రాభిషేకం తప్పక ఆచరించగలరు.

►ALSO READ | వచ్చింది వచ్చినట్లే ఖతం.. విశ్వావసు నామ సంవత్సరంలో సమానంగా సింహరాశి వారి ఆదాయం, వ్యయం

బిగ్​ ఇండస్ట్రీ వారికి ధనయోగము. స్మాల్​ ఇండస్ట్రీ వారికి అనుకూలం. ఫార్మా వారికి అనుకూలం. వెండి, బంగారం వ్యాపారులకు అనుకూలం. టింబర్​, ఐరన్​, కంకర వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఫ్యాన్సీ, కిరాణ, వస్త్ర వ్యాపారులకు అనుకూలం. పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ, పశువుల పరిశ్రమ న్యాయసమ్మతమైన విధంగా ఉంటుంది. చిట్స్​, ఫైనాన్స్​ చాలా జాగ్రత్తగా ఉండాలి. షేర్స్​ విషయంలో రక్షణ లేకుండా ఉండగలరు. చాలా జాగ్రత్త అనే చెప్పాలి. ఏ వృత్తి వారు అయినా కొంత వెసులుబాటు కలిగి ఉంటారు. 

పిల్లల వివాహ విషయంలో మీరు అనుకున్నట్లు జరుగుతుందని చెప్పలేకపోతున్నాం. కారణం ప్రేమ వివాహములు. ఈ జాతకులు తొందరగా మాట వినరు. కారణం పెద్దవారు పిల్లలతో ఫ్రెండ్​షిప్​ చేయుటలేదు. గడచిన రోజులు ప్రక్కనపెట్టి తల్లిదండ్రులు పిల్లలకు దగ్గరగా ఉండి ప్రతి విషయంలో షేర్​ చేసుకోవాలి. పిల్లలకు ఆనందంగా ఉంటుంది. కాలేజీలో క్రమశిక్షణగా ఉండగలరు. ఇది నిజంగా పిల్లలకు పూజ చేయుట మంగళహారతి పాటలు పాడుట వాకిట్లో ముగ్గులు వేయుట నేర్పించిన వారి ఆలోచనలో కొంత మార్పు ఉంటుంది.

ఇది అంతయు సాంప్రదాయ సంస్కారములు ఆచరించుటకు ప్రయత్నం చేయండి. కట్టు, బొట్టు పైన శ్రద్ధ పెట్టండి. మీ జడ్జిమెంట్​కు మీరు పరీక్ష పెట్టుకొని ప్రారంభించండి. ఉత్తర నక్షత్రం వారు జాతి కెంపు ధరించి ఆదిత్య హృదయం పారాయణ అవకాశం ఉన్నవారు అరసవెళ్లి సూర్యనారాయణ పూజలు  హోమం గోధుమలు దానం ఇవ్వండి.

హస్త నక్షత్రం వారు ముత్యం ధరించండి. ముత్యాల హారం ధరించవచ్చును. దుర్గాదేవికి కుంకుమ పూజ అష్టోత్తర సహస్రనామాలు, చీర జాకెటుముక్క గాజులు నిమ్మకాయ దండ పానకము వడపప్పు కొబ్బరికాయలు5 శుక్రవారం సాయంత్రం ఈ పూజ చేయించిన వివాహ దోషాలు తొలగును. భార్యాభర్తల తగాద సమసిపోవును. ఈ విధంగా 9 శుక్రవారములు చేయించి చూడండి. మీకు అర్థమవుతుంది.

►ALSO READ | విశ్వావసు నామ సంవత్సర మీనరాశి వారి జాతకం.. ఆదాయం, అవమానం, ఖర్చులు ఎలా ఉన్నాయంటే..?

 చిత్త నక్షత్రం వారు పగడం ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజలు చేయించండి. గోవునకు 450 గ్రా. కందులు దాన పెట్టండి. గుడిలో పూజారిగారికి ఎరుపు వస్త్రంలు కందులు కిలోంబావు ఇవ్వండి. యోగ, ధ్యానం చేయుట వలన అనారోగ్య సమస్యలు ఉండవు. ఈ రాశి వారు పూజలు చేసే వారికి తొందరగా అనారోగ్యం రాదు. కొంత వ్యాధులు రావటానికి శని రాహు కేతువుల ప్రభావము ఉన్నది. ఎవరికి వారు ఆచరించి ఆనందంగా ఉండగలరు. అదృష్టసంఖ్యం 6.