వైద్య‌రంగంలో స‌రికొత్త టెక్నాల‌జీ

వైద్య‌రంగంలో స‌రికొత్త టెక్నాల‌జీ

1960ల్లో ఫెంటాస్టిక్‌‌‌‌‌‌‌‌ వొయేజ్‌ అని ఓ సైన్స్‌‌‌‌‌‌‌‌ ఫిక్షన్‌‌‌‌‌‌‌‌ సినిమా వచ్చిం ది. అందులో సైంటిస్టులు చిన్నగైపోయి మనిషి రక్తనాళాల్లోకి వెళ్తారు.. అచ్చం అలానే ఇప్పుడు డాక్టర్లు ఆపరేషన్లు చేసే టెక్నాలజీ వచ్చింది.. అయితే సినిమాలోలాగా రక్తనాళాల్లోకి వెళ్లరు గానీ మనిషిలోని చిన్న రక్తనాళాలను పెద్దగా చూస్తూ ఈజీగా చికిత్స చేస్తారు.అమెరికాలోని వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ల బృందం ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. వైద్య ప్రపంచంలో ఈ వర్చువల్‌‌‌‌‌‌‌‌ రియాలిటీ టెక్నాలజీ కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. మెడికల్‌‌‌‌‌‌‌‌ స్టూ డెంట్లు , సర్జన్లు కష్టమైన ఆపరేషన్లను సులభంగా చేసే అవకాశం కలిగింది. మెడికల్‌‌‌‌‌‌‌‌ ఇమేజింగ్‌ ద్వారా మనిషి లోపలి శరీర భాగాలకు చికిత్స చేసే రేడియాలజిస్టులకు వాళ్ల పనిని మరింత సులువు చేసింది.

అలా ఆపరేషన్‌ చాలా కష్టం

సాధారణంగా నాళాల్లో రక్తం గడ్డకట్టు కోవడం,గుండె పోటు, కేన్సర్‌‌‌‌‌‌‌‌కు చికిత్సకు ఇంటర్వె న్షనల్‌‌‌‌‌‌‌‌ రేడియాలజిస్టులు రేడియేషన్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీని వాడుతారు. దీనికోసం ఓ చిన్న ట్యూబ్‌ ను, 2డీ టెక్నాలజీ, ఎక్స్‌‌‌‌‌‌‌‌రే ఇమేజింగ్‌ సాయం తీసుకుంటా రు. ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ జరుగుతున్నంత సేపూ పేషెంట్‌‌‌‌‌‌‌‌ శరీరంపై ఎక్స్‌‌‌‌‌‌‌‌రే మెషీన్‌‌‌‌‌‌‌‌ పని చేస్తూనే ఉంటుంది. చికిత్స చేసే డాక్టర్లు రేడియే-షన్‌‌‌‌‌‌‌‌ ప్రభావం పడకుండా యాంజియోగ్రఫీ సూట్స్‌‌‌‌‌‌‌‌ వేసుకుంటారు. కానీ గంటల తరబడి నిల్చొని అలా ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ చేయడం చాలా కష్టమైన పని. వెన్ను నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ వర్సిటీలోని డాక్టర్‌‌‌‌‌‌‌‌ వేనే మోన్‌‌‌‌‌‌‌‌స్కైకి ఈ కష్టం బా గా తెలుసు.ఇలాంటి ఆపరేషన్లు చేసి ఆయనకు మెడ నొప్పి , వెన్నునొప్పి వచ్చిం ది. అందుకే సమస్య నుం చి డాక్టర్లను గట్టెక్కించేం దుకు అతను, అతని టీం ఈ టెక్నాలజీని సృష్టించిం ది.

రెండే పరికరాలు

ఎలక్ట్రో మాగ్నె టిక్‌‌‌‌‌‌‌‌ సెన్సా ర్స్‌‌‌‌‌‌‌‌తో కొత్త కాథెటర్‌‌‌‌‌‌‌‌ (ట్యూబ్‌ )ను యూనివర్సిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ డాక్టర్లు రూపొందించారు. వర్చు వల్‌‌‌‌‌‌‌‌ రియాలిటీ హెడ్‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకుంటే ట్యూబ్‌ ను ప్రవేశపెట్టిన రక్తనా ళాలు చాలా పెద్దగాకనిపిస్తా యి. డాక్టర్లు ఈజీగా చికిత్స చేయొచ్చు.ఇం దులో ఎలక్ట్రో మాగ్నె టిక్‌‌‌‌‌‌‌‌ సెన్సర్స్‌‌‌‌‌‌‌‌ అమర్చిన ట్యూబ్‌రక్తనా ళాల సైజు, ఆకారాన్ని లెక్కగడుతుంది. దీన్ని వర్చు వల్‌‌‌‌‌‌‌‌ రియాలిటీ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌కు అందిస్తుం ది. అది3డీ ఇమేజ్‌ ను సృష్టిస్తుం ది. డాక్టర్లు పెట్టు కునే 3డీగ్లాసుల్లో రక్తనా ళాలు పెద్దగా కనబడి ఈజీగా చికిత్స చేస్తారు. ఇందులో వాడే పరికరాలన్నీ చిన్నవే. ఓ ప్రత్యే క ట్యూబు , వీఆర్‌‌‌‌‌‌‌‌ గ్లాసు లు. డాక్టర్లు యాంజియోగ్రఫీ సూట్లు వాడాల్సిన అవసరం ఉండదు. ఎక్స్‌‌‌‌‌‌‌‌రేమెషీన్లు, పెద్ద పెద్ద స్క్రీన్లు అస్సలు అవసరం లేదు.ఫుడ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రే షన్‌‌‌‌‌‌‌‌ శాఖ ఈ టెక్నాలజీని ఒకే చేస్తే చాలు అందుబాటులోకి వస్తుంది.