Samyuktha Menon: అవును... నాకు మద్యం సేవించే అలవాటు ఉంది...

Samyuktha Menon: అవును... నాకు మద్యం సేవించే అలవాటు ఉంది...

తెలుగుతో పాటూ తమిళ, మలయాళ సినిమాతో కూడా సౌత్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్. ఈ అమ్మడు ఓ వైపు మూవీలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన ఫొటోలను, అప్డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా సంయుక్త తన లైఫ్ స్టైల్ గురించి చెప్పే క్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

తనకు ఆల్కహాల్ సేవించే అలవాటుందని, కానీ అదే పనిగా తాగనని, ఎప్పుడైనా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మాత్రమే కొంచెం వైన్ తీసుకుంటానని చెప్పింది. మామూలుగా హీరోయిన్లకు ఇలాంటి అలవాట్లున్నా ఎవరూ బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ సంయుక్త మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా ముక్కు సూటిగా చెప్పేసింది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి తన ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచిన సంయుక్త కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక

ఇక సినిమాల విషయానికొస్తే భీమా నాయక్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంయుక్త మీనన్ ఆ తర్వాత కల్యాణ్ రామ్ సరసన బింబిసారలో నటించింది. తర్వాత సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష మూవీ చేసి హ్యాట్రిక్ హిట్లు అందుకుంది. తమిళంలో ధనుష్ సరసన చేసిన సార్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో అమ్మడు సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం సంయుక్త మీనన్ బింబిసార2, స్వయంభు, అఖండ2 సినిమాలతో బిజీగా ఉంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samyuktha (@iamsamyuktha_)